HDFC Bank: Q4 ఫలితాల్లో అదరగొట్టిన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్; భారీ డివిడెండ్ కూడా..
15 April 2023, 16:58 IST
HDFC Bank Q4 results: 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4) ఫలితాలను హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) ప్రకటించింది. మార్చి నెలతో ముగిసే చివరి త్రైమాసికంలో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) రూ. 12,047.5 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
ప్రతీకాత్మక చిత్రం
HDFC Bank Q4 results: 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY23) లో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) మెరుగైన ఫలితాలను సాధించింది. సంస్థ పన్ను అనంతర లాభాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY22)తో పోలిస్తే 20% పెరిగాయి.
HDFC Bank Q4 results: నికర వడ్డీ ఆదాయంలోనూ పెరుగుదల
హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) ఈ Q4 లో నికర వడ్డీ ఆదాయం (net interest income NII) లోనూ మంచి ఫలితాలను సాధించింది. ఈ Q4 లో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) నికర వడ్డీ ఆదాయం రూ. 23,351.80 కోట్లు గా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం Q4 తో పోలిస్తే ఈ Q4 లో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) నికర వడ్డీ ఆదాయం 23.7% పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం Q4లో బ్యాంక్ ఎన్ఐఐ (NII) రూ. 18,872.7 కోట్లు. డిపాజిట్స్ (deposits), రుణ వితరణ (credit) లోనూ బ్యాంక్ మంచి పనితీరు కనబర్చింది. ఈ Q4FY23 లో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ (profit before tax) రూ. 15,935.5 కోట్లుగా ఉంది.
HDFC Bank Q4 results: రూ. 19 డివిడెండ్
హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) నికర ఆదాయం (net revenue) ఈ Q4 లో రూ. 32,083.0 కోట్లు. ఇది అంతకుముుందు ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY22)లో బ్యాంక్ ఆర్జించిన రూ. 26,509.8 కోట్ల నికర ఆదాయం కన్నా 21% అధికం. 2022-23 ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY23) లో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) సాధించిన మొత్తం డిపాజిట్లు (Total deposits) రూ. 1,883,395 కోట్లు. కాగా, Q4 ఫలితాలను ప్రకటించడంతో పాటు, తమ షేర్ హోల్డర్లకు రూ. 1 ముఖ విలువ కలిగిని ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 19 ఫైనల్ డివిడెండ్ () ఇస్తున్నట్లు హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) ప్రకటించింది.