HDFC Bank Q3 results 2023: హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ Q3 ఫలితాలు
HDFC Bank Q3 results 2023: ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ల్లో ఒకటైన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank)మూడో త్రైమాసిక (Q3) ఫలితాలను శనివారం విడుదల చేసింది. నికర లాభాల్లో ఈ త్రైమాసికం (Q3)లో ఆశాజనక ఫలితాలను హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) సాధించింది.
HDFC Bank Q3 results 2023: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్ - డిసెంబర్ 2022) ఫలితాలను హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) ప్రకటించింది. బ్యాంకింగ్ నిపుణుల అంచనాలను మించిన లాభాలను ఈ దిగ్గజ ప్రైవేటు బ్యాంక్ సాధించింది.
HDFC Bank Q3 results 2023: నికర లాభాల్లో 18.5% పెరుగుదల
హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో గత ఆర్థిక సంవత్సరం Q3 తో పోలిస్తే, 18.50% అధిక నికర లాభాలను ఆర్జించింది. ఈ Q3లో బ్యాంక్ (HDFC Bank) రూ. 12,259.50 కోట్ల నికర లాభాలను ఆర్జించగా, గత Q3లో బ్యాంక్ సాధించిన నికర లాభాలు రూ. 10,342.20 కోట్లు. నికర లాభాలతో పాటు నికర వడ్డీ లాభాల్లోనూ (net interest income NII)) మెరుగైన ఫలితాలను సాధించినట్లు హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ప్రకటించింది. ఈ Q3 లో బ్యాంక్ (HDFC Bank) సాధించిన NII రూ. 22,987.9 కోట్లు కాగా, ఈ NII గత Q3 తో పోలిస్తే 24.60% అధికం. గత ఆర్థిక సంవత్సరం Q3 లో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) రూ. 18,443.50 కోట్ల నికర వడ్డీ లాభాలను ఆర్జించింది.
HDFC Bank Q3 results 2023: నికర ఆదాయంలోనూ బెటర్ రిజల్ట్స్
హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) నికర ఆదాయం ఈ Q3 లో రూ. 31,487.7 కోట్లు. కాగా, గత ఆర్థిక సంవత్సరం Q3లో బ్యాంక్ నికర ఆదాయం రూ. 26,627 కోట్లు. అంటే, గత Q3 లో కన్నా ఈ Q3లో బ్యాంక్ (HDFC Bank Q3 results) నికర ఆదాయం 18.3% పెరిగింది. ప్రొవిజన్స్ మేనేజ్ మెంట్ లోనూ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఈ Q3 లో మెరుగైన ఫలితాలను సాధించింది. Q2 లో ఈ ప్రొవిజన్స్ ఖర్చు రూ. 3,240.1 కోట్లు కాగా, Q3లో అది రూ. 2,806.4 కోట్లకు తగ్గింది. అలాగే, ఈ Q3 లో బ్యాంక్ (HDFC Bank Q3 results) ఫీ అండ్ కమిషన్స్ ద్వారా రూ. 6,052.6 కోట్లను, ఫారిన్ ఎక్స్ చేంజ్ అండ్ డెరివేటివ్స్ ద్వారా రూ. 1,074.1 కోట్లను, నెట్ ట్రేడింగ్ ద్వారా రూ. 261.4 కోట్లను, ఇతర ఆదాయాల ద్వారా రూ. 1,112.5 కోట్లను ఆర్జించింది. ఇందులో గత సంవత్సరం Q3 (HDFC Bank Q3 results) కన్నా నెట్ ట్రేడింగ్ ఆదాయంలో భారీ తగ్గుదల నమోదైంది. గత Q3 లో బ్యాంక్ నెట్ ట్రేడింగ్ ఇన్ కం 1,046.5 కోట్లు. ఈ Q3 లో అది కేవలం రూ. 261.4 కోట్లు. ఆస్తులు, అప్పుల రేషియో విషయానికి వస్తే, ఈ Q2 లో అది 9.29% గా ఉండగా, ఈ Q3 లో అది 9.18 శాతానికి తగ్గింది.