Online shopping : ఆన్లైన్ షాపింగ్‌లో ఎక్కువ ఖర్చు చేసేది పురుషులే!
28 March 2023, 13:52 IST
Men spend more on online shopping : షాపింగ్ అంటే కేవలం మహిళలకే అనుకునేవారు చాలా మంది ఉంటారు. అయితే.. ఆన్లైన్ షాపింగ్ విషయంలో మహిళల కన్నా పురుషులే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని మీకు తెలుసా? ఇది నిజమే..
ఆన్లైన్ షాపింగ్‌లో ఎక్కువ ఖర్చు చేసేది పురుషులే!
Online shopping : ఆన్లైన్ ఆర్డర్ల విషయంలో.. పెద్ద నగరాల్లోని ప్రజలతో పోల్చుకుంటే చిన్న నగరాల్లో నివాసముండే వారే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఓ నివేదికలో తేలింది. టైర్ 1 నగరాలతో పోల్చితే.. టైర్-2,4 నగరాల్లోనే 77శాతం ఎక్కువ ఖర్చు అవుతోందని పేర్కొంది.
'డిజిటల్ రీటైల్ ప్లాట్ఫార్మ్స్ అండ్ కన్జ్యూమర్ ఎమోషన్స్ : ఆన్ ఇండియన్ పర్స్పెక్టివ్' పేరుతో ఓ నివేదికను రూపొందించింది ఐఐఎం అహ్మదాబాద్. నివేదిక ప్రకారం.. సర్వే చేసిన వారిలో చాలా మంది వినియోగదారులు.. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫార్మ్లను 2,3 రోజులకోసారి వాడుతుంటారు. ఆన్లైన్ షాపింగ్ అనేది ప్రజలకు ఓ హాబీగా మారిపోయింది.
Online shopping trend in India : చాలా మంది కస్టమర్లు సగటున 34-35 నిమిషాలు ఆన్లైన్ షాపింగ్ కోసం వినియోగిస్తున్నారు. కొవిడ్ సంక్షోభం కారణంగా ఆన్లైన్ షాపింగ్‌కు విపరీతమైన డిమాండ్ కనిపించింది. 1-3 ఏళ్ల ముందు నుంచే ఆన్లైన్ షాపింగ్ చేసిన వారు దాదాపు 72శాతం మంది ఉండటం గమనార్హం.
ఆ విషయంలో పురుషులే ఎక్కువ..!
ఆన్లైన్ షాపింగ్ అంటే మహిళలకే అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. మహిళలే ఎక్కువ ఖర్చు చేస్తారని అనుకుంటాము. అయితే.. ఈ నివేదికలో షాకింగ్ విషయం బయటపడింది. ఆన్లైన్ షాపింగ్‌లో మహిళల కన్నా పురుషులే 36శాతం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్టు తేలింది.
Men spend more on online shopping : మహిళలు.. దస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులను షాప్ చేస్తుండగా.. పురుషులు ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా ఉందని పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా భావిస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ విషయంలో మహిళలు డెలివరీ టైమ్, రిటర్న్ పాలసీపై ఎక్కువగా దృష్టిపెడుతుంటే.. పురుషులు ప్రాడక్ట్ క్వాలిటీ, ఈఎంఐ ఆప్షన్స్, ఆన్లైన్ రికమెండేషన్స్ వంటికి ప్రాధాన్యతని ఇస్తున్నారు.
Online shopping facts : బయట షాపింగ్ కన్నా అన్లైన్ షాపింగ్ చాలా అనుకూలంగా ఉందని.. 24ఏళ్లలోపు యువత, 60ఏళ్లు దాటిన వృద్ధుల భావిస్తున్నారు. 35ఏళ్ల కన్నా తక్కువ వయస్సున్న కస్టమర్లు.. ఒక వస్తువును కొనే ముందు వివిధ వెబ్సైట్లను చూస్తున్నారు. ఆ తర్వాతే కొనుగోలు చేస్తున్నారు.