Shopping Destinations in India । భారతదేశంలో షాపింగ్ చేయడానికి అద్భుతమైన ప్రదేశాలు ఇవే!
- Shopping Destinations in India: భారతదేశం కేవలం సుందరమైన పర్యాటక ప్రదేశాలు, గొప్ప వారసత్వ కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు మాత్రమే నిలయం కాదు, విదేశీయులకు కూడా విశేషంగా ఆకర్షించే ఒక పెద్ద షాపింగ్ హబ్. ఇండియాలో షాపింగ్ చేయడానికి కొన్ని గొప్ప ప్రదేశాలు చూద్దాం రండి..
- Shopping Destinations in India: భారతదేశం కేవలం సుందరమైన పర్యాటక ప్రదేశాలు, గొప్ప వారసత్వ కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు మాత్రమే నిలయం కాదు, విదేశీయులకు కూడా విశేషంగా ఆకర్షించే ఒక పెద్ద షాపింగ్ హబ్. ఇండియాలో షాపింగ్ చేయడానికి కొన్ని గొప్ప ప్రదేశాలు చూద్దాం రండి..
(1 / 8)
షాపింగ్ ప్రియులకు భారతదేశం ఒక స్వర్గధామం అని చాలా మందికి తెలియదు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ ప్రధాన నగరాల్లో వివిధ రకాల మార్కెట్‌లు ఉన్నాయి, లేటెస్ట్ ఫ్యాషన్ లేబుల్స్, బ్రాండెడ్ స్టోర్ల నుంచి స్ట్రీట్ షాపింగ్ వరకు ఇక్కడ చాలా ఆప్షన్లు ఉన్నాయి. అగ్రగామిగా ఏ ప్రదేశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
(freepik )(2 / 8)
సరోజినీ నగర్, ఢిల్లీ: స్థానికుల నుండి విదేశీయుల వరకు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్లలో న్యూ ఢిల్లీలోని సరోజిని నగర్ మార్కెట్ ఒకటి. ఇక్కడ మీరు సాంప్రదాయ వస్తువుల నుండి ఫ్యాషన్ బట్టలు, కొలోన్‌లు, ఉపకరణాలు ఇంకా అనేకమైన ట్రెండింగ్ వస్తువులను మీకు కావాలసిన బడ్జెట్ ధరల్లో కొనుక్కోవచ్చు. ఈ ప్రదేశం స్ట్రీట్ ఫుడ్‌కి కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
( Amal KS / Hindustan Times)(3 / 8)
కొలాబా కాజ్‌వే, ముంబై: మీరు అన్ని రకాల దుస్తులను కొనుగోలు చేయగల అత్యంత ప్రసిద్ధ షాపింగ్ వీధి. అంతే కాకుండా, నగలు, ఉపకరణాలు సహా ఇతర అనేక రకాల వస్తువులు లభిస్తాయి. ఇందులో చౌకైనవి, అత్యంత ఖరీదైనవి అన్నీ ఉంటాయి. విశ్రాంతి తీసుకోవడానికి ప్రముఖ వీధి రెస్టారెంట్‌లు, కాఫీ షాప్‌లతో నిండి ఉంది
(pinterest)(4 / 8)
జన్‌బాద్, జైపూర్: సాంప్రదాయ రాజస్థానీ దుస్తులు, హస్తకళలకు ఇది ప్రసిద్ధ మార్కెట్. ఇంకా ఇక్కడ వెండి ఆభరణాలు , రంగురంగుల టై ఫ్యాబ్రిక్‌లను కొనుగోలు చేయవచ్చు
(pinterest)(5 / 8)
అంజూనా ఫ్లీ మార్కెట్, గోవా: వారానికోసారి బుధవారం జరిగే ఈ మార్కెట్ రంగురంగుల అలంకరణలతో బోహేమియన్ వైబ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది మీరు బట్టల ఉపకరణాల నుండి రుచికరమైన ఆహారం వరకు ప్రతిదాని కోసం అన్వేషించగల మార్కెట్ ప్లేస్.
(pinterest)(6 / 8)
కమర్షియల్ స్ట్రీట్, బెంగళూరు: ఈ ప్రదేశం బెంగళూరులోని పురాతనమైన, అతిపెద్ద షాపింగ్ ప్రాంతం. ఇక్కడ మీరు తక్కువ ధరలకు బట్టలు, నగలు, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆహారానికి సంబంధించినంత వరకు మీరు వివిధ రకాల ఫాస్ట్ ఫుడ్‌లను రుచి చూడవచ్చు.
(pinterest)(7 / 8)
మాల్ రోడ్, సిమ్లా: మాల్ రోడ్ గ్లూక్లూ నగరం సిమ్లాలో ప్రసిద్ధ షాపింగ్ ప్రదేశం. ఈ ప్రాంతంలో దుస్తులు, సావనీర్‌లు, ఎలక్ట్రానిక్స్‌ను రోడ్డు పక్కన వ్యాపారులు అలాగే దుకాణాల నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ రహదారి దాని కలోనియల్ ఆర్కిటెక్చర్‌కు ప్రసిద్ధి చెందింది, అందమైన కొండల మధ్య సుందరమైన దృశ్యాన్ని అందిస్తుంది.
(Unsplash)(8 / 8)
లాడ్ బజార్, హైదరాబాద్: లాడ్ బజార్, దీనిని చుడీ బజార్ అని కూడా పిలుస్తారు, ఇది హైదరాబాద్‌లోని ప్రసిద్ధ మార్కెట్లలో ఒకటి. వివిధ రకాల సాంప్రదాయ హైదరాబాదీ ఆభరణాలు, గాజులు, ముత్యాలు మొదలైన వాటి కోసం షాపింగ్ చేయడానికి గొప్ప ప్రదేశం. ఇది క్లిష్టంగా, అందంగా రూపొందించిన చేతివృత్తి వస్తువులకు కూడా ప్రసిద్ధి చెందింది.
(pinterest)ఇతర గ్యాలరీలు