తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Scam Calls: స్కామ్ కాల్స్ చిరాకు పెడ్తున్నాయా? చక్షు పోర్టల్ లో రిపోర్ట్ చేయండి.. ఆ నంబర్స్ ను బ్లాక్ చేస్తారు

Scam calls: స్కామ్ కాల్స్ చిరాకు పెడ్తున్నాయా? చక్షు పోర్టల్ లో రిపోర్ట్ చేయండి.. ఆ నంబర్స్ ను బ్లాక్ చేస్తారు

HT Telugu Desk HT Telugu

09 May 2024, 11:08 IST

  • Scam calls: ఆర్థిక మోసాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే మొబైల్ నంబర్స్ ను ప్రభుత్వం బ్లాక్ చేస్తోంది. మీకు ఏదైనా స్కామ్ కాల్ వచ్చినా, మీరు ఏదైనా స్కామ్ బారిన పడినా ఆ నంబర్ పై వెంటనే టెలీకాం శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్ లో రిపోర్ట్ చేయండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

ప్రతీకాత్మక చిత్రం

Chakshu portal: టెలీకాం శాఖ మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే హ్యాండ్ సెట్ లను, మొబైల్ నంబర్లను బ్లాక్ చేస్తోంది. వాయిస్ కాల్స్ ద్వారా, టెక్స్ట్ సందేశాల ద్వారా మొబైల్ వినియోగదారులను మోసం చేయడానికి ఈ హ్యాండ్ సెట్స్ ను, మొబైల్ నంబర్లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లను గుర్తించేందుకు టెలికాం శాఖ ఈ ఏడాది చక్షు పోర్టల్ (Chakshu portal) ను ప్రారంభించింది. మీరు కూడా ఆ పోర్టల్ లో మీకు వచ్చే స్కామ్ కాల్స్ పై రిపోర్ట్ చేయవచ్చు.

మోసాలకు ఉపయోగించే నంబర్లను బ్లాక్ చేసిన టెలికాం శాఖ

మొబైల్ లో ఫిషింగ్ సందేశాలు పంపిస్తున్న 52 సంస్థలను టెలికాం శాఖ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఇప్పటివరకు 348 మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసింది. 10834 అనుమానిత మొబైల్ నంబర్లను రీ వెరిఫికేషన్ కోసం గుర్తించింది. వీటిలో 8,272 మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసింది. మీరు కూడా అటువంటి మోసాల బారిన పడినట్లయితే, దయచేసి వెంటనే అనుమానిత మోసాన్ని చక్షు పోర్టల్ కు నివేదించండి. మీరు కూడా ఫేక్ కాల్స్, అనుమానాస్పద ఎస్ఎంఎస్ లకు బలైపోతే, సంబంధిత శాఖ దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుగా చక్షు పోర్టల్ నంబర్ ను షేర్ చేయాలని వినియోగదారులకు టెలీకాం శాఖ సూచిస్తోంది. ఈ పోర్టల్ లో ఒక నెంబరును మీరు ఎలా రిపోర్ట్ చేయవచ్చో చూడండి.

చక్షు పోర్టల్ లో మొబైల్ నెంబరుకు సంబంధించి ఎలా ఫిర్యాదు చేయాలి?

మోసపూరిత కాల్స్, మెసేజెస్ కు సంబంధించి టెలీకాం శాఖ కు చెందిన చక్షు పోర్టల్ లో ఈ కింది స్టెప్స్ ద్వారా రిపోర్ట్ చేయవచ్చు

  • ముందుగా సంచార్ సాథీ వెబ్ సైట్ https://sancharsaathi.gov.in/sfc/ ను సందర్శించండి.
  • అందులో "సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్" ను గుర్తించండి. అందులోని "చక్షు - అనుమానిత మోస కమ్యూనికేషన్ రిపోర్ట్" పై ట్యాప్ చేయండి.
  • ఇప్పుడు, కంటిన్యూ ప్రెస్ చేయండి.
  • అనంతరం, ధృవీకరణ కోసం మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి.
  • మీ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామాకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
  • ఇప్పుడు కాల్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ వంటి కమ్యూనికేషన్ రకాన్ని ఎంచుకోవాలి.
  • మీకు వచ్చిన స్కామ్ కాల్ లేదా మీరు మోసపోయిన ఘటనను వివరిస్తూ, సంబంధిత వ్యక్తి లేదా కాలర్ మొబైల్ నెంబరు, తేదీ, సమయం నమోదు చేయండి.
  • మీరు సందేశం లేదా కాల్ యొక్క స్క్రీన్ షాట్ ను కూడా జోడించవచ్చు.
  • అన్ని వివరాలను జోడించిన తర్వాత, "సబ్మిట్" బటన్ మీద ట్యాప్ చేయండి.

తదుపరి వ్యాసం