Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…-railway uts app makes buying railway general tickets easier and more convenient ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Railway Uts App: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

Sarath chandra.B HT Telugu
May 02, 2024 07:56 PM IST

Railway UTS APP: రైల్వే స్టేషన్లలో జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం కానుంది. కొన్నేళ్ల క్రితం మొబైల్ యాప్‌లో జనరల్, అన్‌ రిజర్వుడు టిక్కెట్ల కొనుగోలుకు ప్రవేశ పెట్టిన ‍యూటీఎస్‌ యాప్‌ను మరింత ఆధునీకరించారు.

ఆధునీకరించిన రైల్వే యూటీఎస్‌ యాప్
ఆధునీకరించిన రైల్వే యూటీఎస్‌ యాప్

Railway UTS APP: రైలు ప్రయాణాల్లో రైలు టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం కానుంది. సాధారణ టిక్కెట్లు, అన్‌ రిజర్వుడు జనరల్ టిక్కెట్లు, ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణాలకు బారులు తీరిన క్యూ లైన్లలో పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్‌లో టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు వీలు కల్పించారు.

‘UTS’ యాప్‌తో రైలు ప్రయాణం కోసం టిక్కెట్‌లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. UTS యాప్ ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి గతంలో ఉన్న దూర పరిమితిని కూడా సడలించారు. రైల్వే స్టేషన్‌ ప్రాంగణం వెలుపల 05 మీటర్లకు దూరం నుంచి ఎలాంటి పరిమితి లేకుండా అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.

అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను కొనుగోలు చేసే ప్రయాణీకులకు ఇబ్బంది లేని మరియు సౌకర్యవంతమైన టికెటింగ్ వ్యవస్థను అందించడానికి, భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన ‘UTS’ మొబైల్ అప్లికేషన్ వినియోగం రోజురోజుకు గుర్తింపు పొందుతోంది.

రైలు ప్రయాణికుల నుండి స్పందన బాగుండటంతో పాటు, ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు చేపట్టారు. యూటీఎస్‌ యాప్‌ ప్రవేశపెట్టినప్పటి నుండి, యాప్‌ని ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. రైలు ప్రయాణీకులను యాప్‌ని ఉపయోగించుకోడానికి ప్రోత్సహించడంలో భాగంగా టిక్కెట్ల కొనుగోలుకు ఉన్న దూర పరిమితిని సడలించి, డిజిటల్ కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నారు. రిజర్వ్ చేయని టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఇది మరింత వెసులుబాటు కల్పించనుంది.

ఇకపై ఎక్కడి నుంచైనా కొనుగోలు చేయొచ్చు..

సబర్బన్ మరియు నాన్-సబర్బన్ స్టేషన్‌లకు గతంలో ఉన్న 20 కి.మీ, 50 కి.మీ.లు దూర పరిమితి పరిమితిని తొలగించారు. ఇకపై రైలు వినియోగదారులు దూర పరిమితి లేకుండా ఎక్కడి నుండైనా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. దీని ప్రకారం, ఇప్పుడు, సబర్బన్ మరియు నాన్-సబర్బన్ స్టేషన్‌లలో ప్రయాణాల కోసం రైల్వే స్టేషన్ ప్రాంగణం వెలుపల 05 మీటర్ల దూరంలో ఉన్న ఏ ప్రదేశం నుంచి అయినా పేపర్‌లెస్ అన్‌రిజర్వ్డ్ జర్నీ/ ప్లాట్‌ఫారమ్/ సీజన్ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.

భారతీయ రైళ్లలో భారీ సంఖ్యలో ప్రయాణీకులు అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను కొనుగోలు చేయడం ద్వారా ప్రయాణిస్తారు, UTS యాప్ అవాంతరాలు లేని రైలు టిక్కెట్‌లను పొందేందుకు వీలు కల్పిస్తోంది. UTS యాప్ ఆండ్రాయిడ్, iOS మరియు Windows ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్ ఫోన్‌లలో పనిచేస్తుందని, ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రైల్వే శాఖ ప్రకటించింది.

UTS యాప్ ద్వారా ప్రయాణీకులు బుకింగ్ కౌంటర్ల దగ్గర క్యూలో నిలబడకుండా మొబైల్ ఫోన్‌ ద్వారా పేపర్‌లెస్ అన్‌రిజర్వ్డ్ ప్రయాణం, ప్లాట్‌ఫాం మరియు సీజన్ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. ఆర్-వాలెట్, సాంప్రదాయ వాలెట్లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వాలెట్ల ద్వారా నగదు చెల్లింపు చేయవచ్చు. ఈ సదుపాయం అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్‌లో పెద్ద ముందడుగు అని అధికారులు ప్రకటించారు.

రైలు ప్రయాణికులు ప్రత్యేకించి జనరల్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే ప్రయాణీకులు యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని మరియు దూర పరిమితుల సడలింపుతో UTS యాప్‌ని ఉపయోగించాలని రైల్వే అధికారులు సూచించారు. స్టేషన్లలో టిక్కెట్ల కొనుగోలు కోసం క్యూలలో నిలబడకుండా నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు ప్లాట్‌ఫాం టికెట్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు.

సంబంధిత కథనం