unlimited 5G plans: అన్ లిమిటెడ్ 5 జీ ప్లాన్స్ గుడ్ బై చెప్పనున్న టెలీకాం సంస్థలు!; భారీగా పెరగనున్న ప్లాన్ టారిఫ్స్!-airtel jio to end unlimited 5g plans by second half of 2024 report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Unlimited 5g Plans: అన్ లిమిటెడ్ 5 జీ ప్లాన్స్ గుడ్ బై చెప్పనున్న టెలీకాం సంస్థలు!; భారీగా పెరగనున్న ప్లాన్ టారిఫ్స్!

unlimited 5G plans: అన్ లిమిటెడ్ 5 జీ ప్లాన్స్ గుడ్ బై చెప్పనున్న టెలీకాం సంస్థలు!; భారీగా పెరగనున్న ప్లాన్ టారిఫ్స్!

HT Telugu Desk HT Telugu
Jan 14, 2024 02:29 PM IST

unlimited 5G plans: 2024 ద్వితీయార్థంలో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ అపరిమిత 5G డేటా ప్లాన్‌లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రస్తుత 4G టారిఫ్ కంటే కనీసం 5-10% అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

unlimited 5G plans: దేశంలోని రెండు అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో 2024 ద్వితీయార్ధంలో తమ అపరిమిత 5జీ డేటా ప్లాన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో ఆ కంపెనీలు ప్రస్తుత 4 జి టారిఫ్ కంటే కనీసం 5-10% అధికంగా 5 జీ టారిఫ్ ను వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.

2022 లో..

రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్ టెల్ (Bharti Airtel) 2022 అక్టోబర్లో భారత దేశంలో 5జీ సేవలను ప్రారంభించాయి. అప్పటి నుండి ప్రస్తుత 4 జీ టారిఫ్లతో అపరిమిత 5 జి సేవలను అందిస్తున్నాయి. అయితే అపరిమిత 5జీ ఆఫర్ల శకం త్వరలోనే ముగియనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, ఆదరణ పెరిగే కొద్దీ మానిటైజేషన్ పై మరింత దృష్టి సారించాలని ఈ రెండు కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు భారతదేశంలో 5 జీ విప్లవంలో ముందంజలో ఉన్నాయి. ఈ రెండు కంపెనీలకు కలిపి 12.5 కోట్లకు పైగా 5 జీ వినియోగదారులు ఉన్నారు. అంతేకాకుండా 2024 చివరి నాటికి దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 20 కోట్లు దాటుతుందని అంచనా.

అపరిమిత 5జీ ఆఫర్ ముగిశాక ఏం జరుగుతుంది?

ఎయిర్ టెల్ , జియో తమ 5జీ ప్లాన్లను 5-10% (ప్రస్తుత 4జీ ప్లాన్లతో పోలిస్తే) పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, మరింత ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడం కోసం 30-40% అదనపు డేటాను అందించవచ్చని సమాచారం. ఆర్వోసీఈ (return on capital employed RoCE) ను మెరుగుపర్చుకునేందుకు 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో మొబైల్ టారిఫ్ లను కనీసం 20 శాతం పెంచవచ్చని తెలుస్తోంది.

ఇంకా పెంచుకోవచ్చు..

భారతదేశంలో టెలికాం సర్వీస్ టారిఫ్ ఇప్పటికీ సగటున నెలకు 2 డాలర్లుగా మాత్రమే ఉన్నందున టెల్కోలు ధరలను పెంచడానికి ఇంకా తగినంత అవకాశం ఉంది. జియో, వీఐ, ఎయిర్ టెల్ సంస్థలు తమ టారిఫ్ లు 19-25 శాతం పెంచి రెండేళ్లు దాటింది. ఆ సంస్థలు 2021 నవంబర్లో తమ 4 జీ టారిఫ్ లను పెంచాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,46,800 కోట్లుగా ఉన్న మొబైల్ రంగం ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,77,300 కోట్లకు, 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,07,800 కోట్లకు పెరుగుతుందని అంచనా ఉంది.