Airtel hikes recharge plan rates: మంత్లీ రీచార్జ్ ప్లాన్ రేటు పెంచిన ఎయిర్ టెల్
Airtel hikes recharge plan rates: ప్రి పెయిడ్ రీ చార్జ్ ప్లాన్స్ (Prepaid recharge plan) లో ఎప్పటికప్పుడు మార్పులు చేసే ఎయిర్ టెల్ (Airtel) తాజాగా, తన పాపులర్ మంత్లీ ప్లాన్ రేట్ పెంచేసింది.

Airtel ₹155 plan: రూ. 155 ప్లాన్
భారతి ఎయిర్ టెల్ (Airtel) ప్రారంభించిన కొత్త రూ. 155 ప్లాన్ ( ₹155 recharge plan) తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రూ. 99 ప్లాన్ లో మాదిరిగా మీటర్డ్ టారిఫ్ కాకుండా, ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అలాగే, 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా కూడా లభిస్తుంది. మొత్త 28 రోజుల్లో 300 ఎస్సెమ్మెస్ లు చేసుకోవచ్చు. కాలింగ్ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేని ఈ ప్లాన్ ( ₹155 recharge plan) ను వినియోగదారులు ప్రోత్సహిస్తారని భావిస్తున్నామని ఎయిర్ టెల్ (Airtel) అధికార ప్రతినిధి అన్నారు.
5G services to more cities: మరిన్ని నగరాలకు 5జీ
మరోవైపు, 5జీ సేవలను ఎయిర్ టెల్ (Airtel) విస్తరిస్తోంది. తాజాగా,తమిళనాడులోని కోయంబత్తూరు, మదురై, హోసూరు, ట్రిచీ పట్టణాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. Airtel 5G Plus ద్వారా హెచ్ డీ వీడియోలను క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని, సూపర్ ఫాస్ట్ గేమింగ్ అనుభూతిని పొందవచ్చని, వేగంగా ఫొటోలు, వీడియోలను అప్ లోడ్ చేయవచ్చని ఎయిర్ టెల్ (Airtel) వెల్లడించింది.విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, తదితర రంగాల్లో Airtel 5G Plus ద్వారా వేగవంతమైన సేవలను పొంది విప్లవాత్మక ఫలితాలను పొందవచ్చని వివరించింది.
టాపిక్