Airtel diwali 2022 recharge offer: ఎయిర్‌టెల్ దీపావళి రీఛార్జ్ ఆఫర్
ఎయిర్ టెల్ ఈ దీపావళి సందర్భంగా ప్రత్యేక రీఛార్జ్ ఆఫర్లు అందిస్తోంది. అలాగే జియో కూడా పలు ఆఫర్లు ప్రకటించింది.
ప్రస్తుతం పండుగ సీజన్‌ల కారణంగా తరచూ ప్రయాణాలు చేసే వారికి ఎక్కువ డేటా అవసరం అవ్వొచ్చు. కాల్స్, ఎస్ఎంఎస్‌ల కంటే ఇప్పుడు డేటా అవసరం మరింత పెరిగిపోయింది.
మీరు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సేవలను ఉపయోగించే వారైనా, లేక ఎయిర్‌టెల్‌కు మారాలని ప్లాన్ చేస్తున్నా ఇది తప్పకతెలుసుకోవాల్సిన అంశం. రాబోయే కొద్ది వారాలలో మీ డేటా, కాలింగ్, మెసేజింగ్ అవసరాలను తక్కువ ఖర్చుతో తీర్చుకోవడానికి కొన్ని స్వల్పకాలిక ప్లాన్‌లు ఇక్కడ ఉన్నాయి.
ఎయిర్‌టెల్ రూ. 209 రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఇది రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లను 21 రోజుల పాటు అందిస్తుంది. ప్రతిరోజూ రిఫ్రెష్ అయ్యేంత డేటా ఉన్నందున ఇది ప్రయాణికులకు మంచి ప్లాన్‌గా చెప్పొచ్చు.
ఒకవేళ వినియోగదారులకు ఎక్కువ డేటా అవసరం లేకపోతే, వారు ఎయిర్‌టెల్ రూ. 155 ప్లాన్ గానీ, రూ. 179 ప్లాన్ గానీ పరిశీలించొచ్చు.
రూ. 155 ప్లాన్ 24 రోజులు, రూ. 179 ప్లాన్ 28 రోజుల పాటు వాలిడిటీ కలిగి ఉంటుంది. రూ. 155 ప్లాన్ అన్ని రోజులూ కలిపి 1జీబీ డేటా, రూ. 179 ప్లాన్ అన్ని రోజులూ కలిపి 2 జీబీ డేటా అందిస్తాయి.
ఇప్పటికే వాలిడిటీ కలిగి ఉన్న వినియోగదారులు డేటా బూస్టర్ ప్యాక్ పరిశీలించొచ్చు. రూ. 148 ప్లాన్ వినియోగదారులకు అదనంగా 15జీబీ డేటాను అందిస్తుంది. రూ. 118 ప్లాన్ 12జీబీ, రూ. 98 ప్లాన్ 5జీబీ, రూ. 58 ప్లాన్ వినియోగదారులకు 3జీబీ డేటా ఇస్తుంది.
రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్
ఇక రిలయన్స్ జియో ఇంటర్నెట్ డేటా, వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి బహిళ ప్రయోజనాలను అందించే జియో 4జీ ప్రీపెయిడ్ వినియోగదారులందరికీ ప్రత్యేక దీపావళి సెలబ్రేషన్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.
జియో దీపావళి సెలబ్రేషన్ ఆఫర్ ధర రూ. 2,999. ఇది 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ఆఫర్‌లో వినియోగదారులు రోజుకు 2.5జీబీ డేటాను పొందుతారు. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 సంక్షిప్త సందేశాలు చేసుకోవచ్చు. అదనంగా జియో ఈ ప్రత్యేక దీపావళి రీఛార్జ్ ప్లాన్‌తో 75జీబీ అదనపు డేటాను అందిస్తోంది. వినియోగదారులు జియోటీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్‌లకు కూడా సభ్యత్వాన్ని పొందుతారు.
దీపావళి పండగ ఆఫర్స్‌లో భాగంగా వివిధ కంపెనీల నుంచి డిస్కౌంట్ కూపన్లను కూడా అందిస్తోంది. ఇక్సిగో నుండి విమాన బుకింగ్‌పై రూ. 750, Ajioపై రూ. 1000, అర్బన్ లాడర్‌పై రూ. 1,500, రిలయన్స్ డిజిటల్‌పై రూ. 1,000 తగ్గింపు వంటి ముఖ్యమైన ప్రయోజనాలు వీటిలో ఉన్నాయి.