Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త.. ఇక ఈ మూడు ప్లాన్‍లతో డిస్నీ+ హాట్‍స్టార్ ఉచితం
Airtel Prepaid Plans: కొత్తగా మూడు ప్లాన్‍లకు డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్‍ను యాడ్ చేసింది ఎయిర్‌టెల్. దీంతో ఇక నుంచి ఈ ప్లాన్‍లను తీసుకునే యూజర్లు ఆ ఓటీటీ బెనిఫిట్‍ను పొందవచ్చు. అయితే ప్రస్తుతం ఓ నిబంధన ఉంది.
Airtel Prepaid Plans: ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ యూజర్లకు తీపికబురు ఇది. ఇటీవల కొన్ని ప్లాన్‍లకు డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్‍ను ఎయిర్‌టెల్ యాడ్ చేస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్‍లతో ఈ ఓటీటీ బెనిఫిట్‍ను ఉచితంగా ఇస్తోంది. ఇదే క్రమంలో మరో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‍లకు తాజాగా డిస్నీ+ హాట్‍స్టార్ బెనిఫిట్‍ను ఎయిర్‌టెల్ జత చేసింది. దీంతో ఈ మూడు ప్లాన్‍లను తీసుకునే యూజర్లు ఇక నుంచి హాట్‍స్టార్ సదుపాయాన్ని కూడా ఉచితంగా పొందవచ్చు. ఎయిర్‌టెల్ కొత్తగా డిస్నీ+ హాట్ స్టార్ బెనిఫిట్‍ను యాడ్ చేసిన ప్లాన్‍లు ఏంటి.. వాటి వివరాలు ఇక్కడ చూడండి.
ఆ మూడు ప్లాన్‍లు ఇవే..
రూ.719, రూ.779, రూ.999 ప్లాన్‍లకు డిస్నీ+ హాట్‍స్టార్ బెనిఫిట్‍ను తాజాగా యాడ్ చేసింది ఎయిర్‌టెల్. ఇక నుంచి ఈ ప్లాన్‍లను రీచార్జ్ చేసుకుంటే డిస్నీ+ హాట్‍స్టార్ మూడు నెలల సబ్‍స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వీటితో పాటు సాధారణంగా ఈ ప్లాన్‍లకు ఉండే బెనిఫిట్స్ వస్తాయి. అయితే.. ప్రస్తుతం ఎయిర్‌టెల్ యాప్ (Airtel App), ఎయిర్‌టెల్ వెబ్‍సైట్ (Airtel Web) నుంచి రీచార్జ్ చేసుకుంటేనే.. ఈ మూడు ప్లాన్‍లకు ఈ అదనపు డిస్నీ+ హాట్‍స్టార్ బెనిఫిట్ లభిస్తోంది. ఆ ప్లాన్‍ల వివరాలు ఇవే.
Airtel రూ.719 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతీ రోజు 1.5 జీబీ డేటా, అన్‍లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు దక్కుతాయి. ఉచిత హలోట్యూన్స్, ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్ యాప్‍లో ఓటీటీల యాక్సెస్, వింక్ మ్యూజిక్ లాంటి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. తాజాగా మూడు నెలల డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్ కూడా వస్తోంది.
Airtel ₹779 Plan: ఇది కూడా డైలీ 1.5జీబీ డేటా ప్లానే. రూ.779 ప్లాన్‍ను తీసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీతో ప్రతీ రోజు 1.5జీబీ డేటా దక్కుతుంది. అన్‍లిమిడెట్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు లభిస్తాయి. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. కొత్త మార్పుతో 3 నెలల పాటు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీని ఉచితంగా వాడుకోవచ్చు.
Airtel ₹999 Plan: ఇక రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‍కు కూడా తాజాగా డిస్నీ+ హాట్‍స్టార్ 3 నెలల ఉచిత సబ్‍స్క్రిప్షన్ జత అయింది. ఈ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే ప్రతీ రోజు 2.5 జీబీ డేటా, అన్‍లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు లభిస్తాయి. వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్‍తో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్‍లో ఓటీటీలు, వింక్ మ్యూజిక్, ఉచిత హలోట్యూన్స్ తో పాటు మిగిలిన ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ వాడుకోవచ్చు.
ఎయిర్‌టెల్ యాప్, ఎయిర్‌టెల్ వెబ్ నుంచి రీచార్జ్ చేసుకుంటేనే ప్రస్తుతం రూ.719, రూ.779, రూ.999 ప్లాన్‍లకు ఉచిత డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్ లభిస్తుంది. యూజర్లు ఇది గమనించాలి.
సంబంధిత కథనం