Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‍న్యూస్.. ఇక ఈ 3 ప్లాన్‍లతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్రీ-airtel cricket plans now coming with amazon prime video subscription know full details
Telugu News  /  Business  /  Airtel Cricket Plans Now Coming With Amazon Prime Video Subscription Know Full Details
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‍న్యూస్
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‍న్యూస్

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‍న్యూస్.. ఇక ఈ 3 ప్లాన్‍లతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్రీ

04 December 2022, 16:38 ISTChatakonda Krishna Prakash
04 December 2022, 16:38 IST

Airtel Plans with Amazon Prime Video benefit: ఎయిర్‌టెల్ కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్‍లకు అమెజాన్ ప్రైమ్ వీడియో బెనిఫిట్‍ను యాడ్ చేసింది. ఈ ప్లాన్‍లను తీసుకుంటే యూజర్లు.. ప్రైమ్ వీడియోను ఉచితంగా వాడుకోవచ్చు.

Airtel Plans with Amazon Prime Video benefit: ఎయిర్‌టెల్ యూజర్లకు తీపికబురు ఇది. మూడు ప్రీపెయిడ్ ప్లాన్‍లకు అదనంగా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్‍ను ఎయిర్‌టెల్ యాడ్ చేసింది. మొత్తంగా క్రికెట్ ప్యాక్స్ కింద ఉండే నాలుగు ప్లాన్‍లలో సవరణ చేసింది. రూ.699, రూ.999, రూ.3,359 ప్లాన్‍తో ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ కూడా ఫ్రీగా లభించనుంది. రూ.2,999 విషయంలో మాత్రం ఎయిర్‌టెల్ కాస్త షాకిచ్చింది. ఈ నాలుగు ప్లాన్స్ బెనిఫిట్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Airtel 699 Plan: ఎయిర్‌టెల్ రూ.699 ప్లాన్‍ను తీసుకుంటే ప్రతీ రోజు 3జీబీ డేటా లభిస్తుంది. అన్‍లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు వాడుకోవచ్చు. వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంటుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ మొబైల్ ప్యాక్, వింక్ మ్యూజిక్ లాంటి థ్యాంక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇప్పుడు వీటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మెంబర్‍షిప్‍ను కూడా యూజర్లు ఫ్రీగా పొందవచ్చు.

Airtel 999 Plan: ఈ ప్లాన్‍ను తీసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. ప్రతీ రోజు 2.5జీబీ డేటా లభిస్తుంది. అన్‍లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు వినియోగించుకోవచ్చు. ఎక్స్‌ట్రీమ్ మొబైల్ ప్యాక్‍తో పాటు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇప్పుడు వీటితో పాటు ఈ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ సబ్‍స్క్రిప్షన్ కూడా అదనంగా లభిస్తుంది.

ఈ ప్లాన్‍తో రెండు ఓటీటీల సబ్‍స్క్రిప్షన్

Airtel 3359 Plan: రూ.3359 ప్రీపెయిడ్ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే ఎయిర్‌టెల్ యూజర్లు 365 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. ప్రతీ రోజు 2.5జీబీ డేటా, అన్‍లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు లభిస్తాయి. వింక్ మ్యూజిక్, ఫ్రీ హలోట్యూన్‍తో పాటు ఇతర థ్యాంక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్ లభిస్తుంది. ఇప్పుడు వీటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మెంబర్‍షిప్‍ను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.

Airtel 2,999 Plan: ఈ ప్లాన్‍ను తీసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతీరోజు 2జీబీ డేటా, అన్‍లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎస్‍లు దక్కుతాయి. ఫ్రీ హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లాంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ ప్లాన్‍కు ఉన్న ఓటీటీ బెనిఫిట్స్ అన్నింటినీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తీసేసింది. ఈ ప్లాన్‍కు డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్‍ను కూడా తొలగించింది.

టాపిక్