Reliance Jio Q3 results: రిలయన్స్ జియో Q3 లాభాలు నాలుగున్నర వేల కోట్లు-reliance jio q3 profit rises by 28 to rs 4 638 cr key highlights ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Jio Q3 Results: రిలయన్స్ జియో Q3 లాభాలు నాలుగున్నర వేల కోట్లు

Reliance Jio Q3 results: రిలయన్స్ జియో Q3 లాభాలు నాలుగున్నర వేల కోట్లు

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 09:32 PM IST

Reliance Jio Q3 results: భారత్ లో టాప్ మోస్ట్ టెలీకాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio ) మూడో త్రైమాసికం (Q3) ఫలితాలు వెలువడ్డాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

టెలీకాం రంగంలో భారత్ లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన సంస్థ రిలయన్స్ జియో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY23) ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది.

Reliance Jio Q3 results: రూ. 4,638 కోట్లు..

ఈ ఆర్థిక సంవత్సరం (FY23) మూడో త్రైమాసికం (Q3) లో రిలయన్స జియో రూ. 4,638 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 తో పోలిస్తే, ఈ Q3 లో రిలయన్స్ జియో 28.29% లాభాలను అధికంగా ఆర్జించింది. గత Q3లో జియో నికర లాభాలు రూ. 3,615 కోట్లు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ తో ముగిసే Q2 లో జియో రూ. 4,518 కోట్ల నికర లాభాలను సాధించగలిగింది.

Reliance Jio Q3 results: మంచి ఆదాయం..

జియో ఈ Q3 లో రూ. 22,998 కోట్ల ఆదాయాన్ని సముపార్జించింది. ఇది గత సంవత్సరం Q3 తో పోలిస్తే, 18.87% అధికం. గత సంవత్సరం Q3లో జియో రూ. 19,347 కోట్లు. అలాగే, ఈ Q2 లో సంస్థ ఆదాయం రూ. 22,521 కోట్లు. అలాగే, ఈ Q3లో వాల్యూ ఆఫ్ సర్వీసెస్

Reliance Jio Q3 results: ఈ ఆర్థిక సంవత్సరంలో

ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలతో 9 నెలలు ముగిసాయి. ఈ 9 నెలల్లో రిలయన్స్ జియో పన్ను అనంతర లాభాల్లో 26.75% మెరుగుదల నమోదైంది. ఈ తొమ్మిది నెలల్లో సంస్థ పన్ను అనంతర లాభాలు రూ. 13,491 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో రిలయన్స్ జియో రూ. 10,643 కోట్ల పన్ను అనంతరం లాభాలను సాధించింది. అలాగే, ఈ 9 నెలల మొత్తం ఆదాయం రూ. 67,392 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో సంస్థ ఆదాయం రూ. 56,076 కోట్లు.