Google Pixel 9 : రెండు రోజుల్లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు లీక్
11 August 2024, 8:15 IST
Google Pixel 9 pro price in India : గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అనే నాలుగు కొత్త డివైజ్లను ఆగస్టు 13న మేడ్ బై గూగుల్ ఈవెంట్లో సంస్థ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్, ధర వివరాలు ఇక్కడ చూడండి..
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ వచ్చేస్తోంది..
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! ఈ ఏడాది మచ్ అవైటెడ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఒకటైన ఈ గూగుల్ పిక్సెల్ 9.. ఆగస్టు 13న లాంచ్కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు మేడ్ బై గూగుల్ ఈవెంట్లో ఈ సిరీస్‌ని గూగుల్ ఆవిష్కరించనుంది. పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అనే 4 కొత్త గ్యాడ్జెట్స్ ఈ సిరీస్‌లో ఉంటాయని తెలుస్తోంది. సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్ లాంచ్‌కు ముందు గూగుల్ తన పిక్సెల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఫీచర్స్, ధరకు సంబంధించిన లీక్డ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పిక్సెల్ 9 ధర- స్పెసిఫికేషన్స్..
పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్ 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుందని సమాచారం. నలుపు, లైట్ యాష్, పింగాణీ, పింక్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుందని పుకార్లు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ మునుపటి మాదిరిగానే కెమెరా సెటప్‌ని కలిగి ఉండవచ్చు. నిగనిగలాడే గ్లాస్ ఎక్ట్సీరియర్ని కలిగి ఉండవచ్చు. కొత్త టెన్సార్ జీ4 చిప్సెట్, 12 జీబీ వరకు ర్యామ్‌తో వస్తుంది.
పిక్సెల్ 9 ధర యూరప్‌లో 899 యూరోలు, అమెరికాలో 599 డాలర్ల నుంచి 799 డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ధర-స్పెసిఫికేషన్లు..
గూగుల్ పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ టెన్సార్ జీ4 ఎస్ఓసితో పనిచేసే అవకాశం ఉంది. 16 జిబి ర్యామ్‌తో వచ్చే అవకాశం ఉంది. ప్రో మోడల్ 4,558 ఎంఏహెచ్ బ్యాటరీతో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ 4,942 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.
పిక్సెల్ 9 ప్రో 128 జీబీ వేరియంట్ ధర 1,099 పౌండ్లు, 256 జీబీ వేరియంట్ ధర 1,199 పౌండ్లు, 512 జీబీ వేరియంట్ ధర 1,329 పౌండ్లు ఉండొచ్చు.
పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర- స్పెసిఫికేషన్లు..
పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 6.4 ఇంచ్ కవర్ డిస్ప్లే, 8 ఇంచ్ ఇన్నర్ డిస్ప్లేతో రానుంది. పిక్సెల్ ఫోల్డ్ ఔటర్ భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 10.5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్, 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ షూటర్ ఉండనుంది.
తాజా గూగుల్ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ 256 జీబీ, 512 జీబీ వేరియంట్ల ధరలు వరుసగా 1,899 యూరోలు, 2,029 యూరోలుగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
ఇవి ప్రస్తుతం రూమర్స్‌గానే ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్స్, వాటి ఫీచర్స్, వాటి ధరలకు చెందిన పూర్తి వివరాలు లాంచ్ టైమ్‌కి అందుబాటులో ఉంటాయి. ఇండియా ఇవి ఎప్పుడు లాంచ్ అవుతాయో చూడాలి.