Google Pixel 9: వచ్చేవారం పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ తో పాటు ఇవి కూడా లాంచ్ అవుతున్నాయి..
పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను గూగుల్ ఆగస్ట్ 14న ఘనంగా నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో లాంచ్ చేస్తోంది. అయితే, ఆ 'మేడ్ బై గూగుల్' ఈవెంట్ లో కేవలం పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను మాత్రమే కాకుండా, పిక్సెల్ వాచ్ 3, పిక్సెల్ బడ్స్ ప్రో 2 వంటి మరికొన్ని లాంచ్ లు కూడా ఉండబోతున్నట్లు సమాచారం.
Pixel 9 launch: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లోని వెనిల్లా పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ లను ఈ ఆగస్ట్ 14న జరగనున్న 'మేడ్ బై గూగుల్' ఈవెంట్ లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. పిక్సెల్ 9 (Pixel 9) సిరీస్ ఫోన్ల గురించి చాలా ఊహాగానాలు వచ్చినప్పటికీ, లాంచ్ తరువాత గానీ, పూర్తి వివరాలు వెల్లడి కావు. అయితే, ఆ 'మేడ్ బై గూగుల్' ఈవెంట్ లో పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ తో పాటు మరికొన్ని డివైజెస్, సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ ను కూడా గూగుల్ లాంచ్ చేయనుంది. 'మేడ్ బై గూగుల్' ఈవెంట్ లో గూగుల్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయడమే కాదు.. మూడవ తరం పిక్సెల్ వాచ్, పిక్సెల్ వాచ్ 3, పిక్సెల్ బడ్స్ ప్రో 2, బహుశా ఆండ్రాయిడ్ 15 ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
పిక్సెల్ వాచ్ 3 ఆగస్టు 14 న లాంచ్
గూగుల్ తన మూడవ తరం స్మార్ట్ వాచ్ పిక్సెల్ వాచ్ 3 (Pixel Watch 3)ను ఈ ఈవెంట్ లో లాంచ్ చేయనుంది. పిక్సెల్ వాచ్ 2తో పోలిస్తే ఈ వాచ్ కు పెద్దగా తేడా ఉండకపోవచ్చని తాజా లీకులు సూచిస్తున్నాయి. ఆండ్రాయిడ్ హెడ్ లైన్స్ ప్రకారం, పిక్సెల్ వాచ్ 3 స్నాప్ డ్రాగన్ వేర్ 5100 చిప్ సెట్, కార్టెక్స్ ఎం 33 కో-ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. పిక్సెల్ వాచ్ 3 (Pixel Watch 3) 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ తో రానుంది. అదనంగా, బ్యాటరీ సామర్థ్యం చాలావరకు అలాగే ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈసారి 60 హెర్ట్జ్ డిస్ ప్లే, 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ తో మెరుగైన స్క్రీన్ ను వినియోగదారులు ఆశించవచ్చు. పిక్సెల్ వాచ్ 3 41 మిమీ, 45 మిమీ అనే రెండు సైజెస్ లో రావచ్చు. వాటి ధరలు వరుసగా $ 349, $ 399 ఉండవచ్చు.
పిక్సెల్ బడ్స్ ప్రో 2
ఈ ఈవెంట్ లో పిక్సెల్ బడ్స్ ప్రో 2 (Pixel Buds Pro 2) కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఇయర్ బడ్స్ ను కొద్దిగా రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. చెవిలో సరిగ్గా సరిపోయేలా బడ్స్ ను రూపొందించారు. పిక్సెల్ బడ్స్ ప్రో 2 పింక్, బ్లాక్, గ్రీన్, గ్రేయిష్ వైట్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఇది మొదటి తరం మోడల్ తో పోలిస్తే చాలావరకు అదే డిజైన్ లో ఉంటుందని తెలుస్తోంది.
గూగుల్ ఆండ్రాయిడ్ 15
హార్డ్ వేర్ తో పాటు, ఆండ్రాయిడ్ 15 (Android 15) ను కూడా ఈ 'మేడ్ బై గూగుల్' ఈవెంట్ లో గూగుల్ (google) విడుదల చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15కు పిక్సెల్ 8 సిరీస్, పిక్సెల్ 7 సిరీస్, పిక్సెల్ 6 సిరీస్, ఏ సిరీస్ మోడళ్లు సపోర్ట్ చేయనున్నాయి. ఆండ్రాయిడ్ 15 ప్రైవేట్ స్పేస్ వంటి కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టనుంది, ఇది బయోమెట్రిక్స్ ఉపయోగించి యాప్ ట్రేలో యాప్స్ ను లాక్ చేయడానికి వినియోగదారులను వీలు కల్పిస్తుంది. వాల్యూమ్ ప్యానెల్, అడాప్టివ్ వైబ్రేషన్, మెరుగైన డోజ్ మోడ్ లలో మార్పులు చేశారు.