తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Lay Off: గూగుల్ లో మరోసారి ఉద్యోగులకు లే ఆఫ్; సంకేతాలిచ్చిన సీఈఓ పిచాయ్

Google lay off: గూగుల్ లో మరోసారి ఉద్యోగులకు లే ఆఫ్; సంకేతాలిచ్చిన సీఈఓ పిచాయ్

HT Telugu Desk HT Telugu

13 April 2023, 16:03 IST

  • Google lay off: గూగుల్ ఉద్యోగులకు మరో షాక్. త్వరలో మరోసారి లే ఆఫ్ ప్రక్రియ చేపట్టే అవకాశాలున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంకేతాలిచ్చారు. 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

Google lay off: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో గూగుల్ నియామక ప్రక్రియలు, భవిష్యత్ ప్రణాళికలు, గతంలో చేసిన పొరపాట్లు మొదలైన వాటిని వివరించారు. అదే సమయంలో గూగుల్ లో మరోసారి గణనీయ స్థాయిలోనే లే ఆఫ్ (lay off) ప్రక్రియ ఉండవచ్చని సంకేతాలిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

EPF withdrawal claim : ఈపీఎఫ్​ క్లెయిమ్​ సెటిల్​ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది?

Mahindra XUV 3XO price : హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Gold and silver prices today : దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్​లో రేట్లు ఇలా..

Tata Nexon CNG : బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​కి ‘సీఎన్​జీ’ టచ్​.. లాంచ్​ ఎప్పుడు?

Google lay off: మళ్లీ లే ఆఫ్

గూగుల్ (Google) ఉత్పాదకతను 20% మేర పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గూగుల్ సీఈఓ (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఆ లక్ష్య సాధనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఈ సంవత్సరం సెప్టెంబర్ లోగా ఆ లక్ష్యాన్ని సాధిస్తామని గూగుల్ సీఈఓ (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఆ లక్ష్య సాధనలో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందన్నారు. అయితే, ఈ లే ఆఫ్ (lay off) కు సంబంధించిన ఇతర ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఆయన ఆసక్తి చూపలేదు. సంస్థలో చోటు చేసుకుంటున్న, చోటు చేసుకోబోయే సంస్కరణలు, మార్పులకు సంబంధించి సంతృప్తితో ఉన్నామని మాత్రం వ్యాఖ్యానించారు. మరోసారి ఉద్యోగుల తొలగింపు (lay off) తప్పదన్న అర్థం Google CEO సుందర్ పిచాయ్ మాటల్లో వ్యక్తమైందని భావిస్తున్నారు.

Google lay off: ఉద్యోగుల నిరసన

ఈ సంవత్సరం జనవరి నెలలో 12 వేల మంది ఉద్యోగులకు గూగుల్ (Google) యాజమాన్య సంస్థ ఆల్ఫా బెట్ (Alphabet Inc) లే ఆఫ్ (lay off) ప్రకటించింది. అంటే, సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో అది సుమారు 6%. దాంతో సుమారు 1400 మంది ఆల్ఫాబెట్ (Alphabet Inc) ఉద్యోగులు సంస్థలో తీసుకుంటున్న లే ఆఫ్ (lay off) నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఈఓకు లేఖ రాశారు. లే ఆఫ్ సమయంలో ఆయా ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరును ఆ ఉద్యోగులు తీవ్రంగా విమర్శించారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలన్న ఇన్వెస్టర్ల ఒత్తిడి మేరకు లే ఆఫ్ (lay off) నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని ఆల్ఫాబెట్ (Alphabet Inc) చెబుతోంది.

టాపిక్