Layoffs at Google India: గూగుల్ ఇండియా నుంచి 453 మంది ఉద్యోగుల తొలగింపు
Layoffs at Google India: గురువారం విధులు ముగించుకున్న భారత్ లోని గూగుల్ (Google India) ఉద్యోగులు కొందరికి మేనేజ్మెంట్ నుంచి షాకింగ్ మెయిల్ వచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
Layoffs at Google India: వివిధ విభాగాల ఉద్యోగులకు..
ఇక విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని పేర్కొంటూ గురువారం రాత్రి వచ్చిన మెయిల్స్ తో ఆ ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. అయితే, ఈ 453 మంది గతంలో లే ఆఫ్ ప్రకటిస్తామని గూగుల్ (Google) ప్రకటించిన 12 వేల ఉద్యోగుల్లో భాగమేనా? లేక వీరిని అదనంగా తొలగిస్తున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులు, అంటే మొత్తం వర్క్ ఫోర్స్ లో సుమారు 6% మందిని ఉద్యోగాల నుంచి తొలగించబోతున్నట్లు జనవరి నెలలో గూగుల్ (Google) సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. రీస్ట్రక్చరింగ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.