తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rate Today: మరింత పెరిగిన బంగారం ధర, స్థిరంగా వెండి: నేటి రేట్లు ఇవే!

Gold Rate Today: మరింత పెరిగిన బంగారం ధర, స్థిరంగా వెండి: నేటి రేట్లు ఇవే!

10 May 2023, 6:22 IST

google News
    • Gold Rate Today: బంగారం ధర మరింత పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగింది. దేశంలోని వివిధ సిటీల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
నేటి బంగారం ధరలు ఇలా..
నేటి బంగారం ధరలు ఇలా.. (MINT_PRINT)

నేటి బంగారం ధరలు ఇలా..

Gold Rate Today: దేశీయ మార్కెట్‍లో బంగారం ధర మరింత పైకి వెళ్లింది. వరుసగా రెండో రోజు రేటు ఎగబాకింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.100 పెరిగి బుధవారం ఉదయం సమయానికి రూ.56,700కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100 పెరిగి రూ.61,850కు ఎగబాకింది. నేడు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. దేశంలోని వివిధ సిటీల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Gold Price Today in Delhi: దేశ రాజధాని ఢిల్లీలోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి. 22 క్యారెట్లకు చెందిన తులం (10 గ్రాములు) బంగారం ధర ఢిల్లీలో రూ.56,850కు చేరింది. 24 క్యారెట్ల చెందిన తులం పసిడి ధర రూ.62,000కు వెళ్లింది.

Gold Price today in Hyderabad: హైదరాబాద్‍‍లో 22 క్యారెట్లకు 10 గ్రాముల బంగారం ధర రూ.56,700కు ఎగబాకింది. 24 క్యారెట్ల మేలిమి పసిడి 10 గ్రాముల రూ.61,850కు చేరింది. ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం తిరుపతిలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

Gold rate in Bengaluru: బెంగళూరులో 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ తులం ధర రూ.56,750కు చేరింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.61,900కు వెళ్లింది. అహ్మదాబాద్‍లోనూ ఇదే ధర నమోదైంది.

Gold Price Today in Mumbai: ముంబై, కోల్‍కతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,700కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ వెల రూ.61,850కు ఎగబాకింది. చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.57,200కు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,400కు చేరింది.

Gold price Today: అంతర్జాతీయ మార్కెట్‍లోనూ గోల్డ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 2,036 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం మళ్లీ తలెత్తుతుందన్న ఆందోళనతో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. దీంతో రేట్లు అధికమవుతున్నాయి. ద్రవ్యోల్బణం, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు గోల్డ్ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి.

ఫ్లాట్‍గా వెండి రేటు

Silver Price Today: దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి రేటు రూ.78,100 వద్ద ఉంది. కిందటి రోజు ధరే కొనసాగింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అనంతరపురం, బెంగళూరులో కిలో వెండి ధర రూ.82,500గా ఉంది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబైల్లో వెండి కిలో రేటు రూ.78,100గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం