తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices: స్వల్పంగా తగ్గిన బంగారం ధర; పెరిగిన వెండి, ప్లాటినం ధరలు

Gold and silver prices: స్వల్పంగా తగ్గిన బంగారం ధర; పెరిగిన వెండి, ప్లాటినం ధరలు

HT Telugu Desk HT Telugu

14 March 2024, 10:49 IST

google News
  • Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఆ వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 130 తగ్గి, రూ. 60,600 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 60,730 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,06,000 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,060గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం రూ. 140 తగ్గింది. గురువారం ఈ ధర రూ. 66,110 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 66,250 గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,62,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,625గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

బెంగళూరులో బంగారం ధర

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,750 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,260 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 66,110 గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 61,350గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,930గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 60,600 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 66,110గాను ఉంది.

హైదరాబాద్ లో బంగారం ధర..

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,600 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,110 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,650గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 66,160 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 60,600గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,110గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధర కూడా..

దేశంలో వెండి ధరలు గురువారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,700 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1800 పెరిగి రూ. 77,000 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 75,200 గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ.80,000 పలుకుతోంది. కేజీ వెండి ధర బెంగళూరులో రూ.​ 74,500.. కోల్ కతాలో రూ. 77,000గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు కూడా గురువారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల ప్లాటినం ధర గురువారం రూ. 450 పెరిగి, రూ. 24,980 కి చేరింది. ఈ ధర బుధవారం రూ. 24,530 గా ఉంది. ఇది బుధవారం నాటి ధర అయిన రూ. 24,530 కన్నా రూ. 450 ఎక్కువ.

ఇక హైదరాబాద్​లో కూడా ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 24,980 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం