Gold and silver prices Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు
09 November 2023, 9:43 IST
Gold and silver rate today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆ వివరాలు..
ప్రతీకాత్మక చిత్రం
Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు గురువారం కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 56,090 గా ఉంది. బుధవారం ఈ ధర రూ. 56,100 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,69,000 కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,609 గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 61,190 కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,200 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,11,900గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,119 గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం రేట్లు గురువారం ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,240 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,340 గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,090 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 61,190 గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,590 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,740 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 56,090 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,190 గాను ఉంది.
హైదరాబాద్లో..
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 56,090 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,190 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,140 గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,240 గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,090 గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,190 గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు ఇలా..
దేశంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,350 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 73,500 గా కొనసాగుతోంది. బుధవారం కూడా ఇదే ధర ఉంది. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 76,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో కేజీ రూ. 73,500.. బెంగళూరులో రూ. 73,000 గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)