తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Gold and silver prices today : మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu

17 February 2024, 5:32 IST

google News
    • Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా వృద్ధిచెందాయి. ప్లాటీనం రేట్లు సైతం పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Bloomberg)

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 57,110కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 57,100గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 5,71,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,711గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 62,300కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,290గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 6,23,000గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,260గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,450గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,110 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,300గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,610గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,850గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,110గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,300గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,110గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,300గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,160గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,350గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,110గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,300గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,570గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 75,700కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 75,600గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 75,700.. బెంగళూరులో రూ. 70,800గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 190 పెరిగి.. రూ. 23,880కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,690గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,880గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం