తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : అక్టోబర్​ 12 : మరింత పెరిగిన పసిడి, వెండి ధరలు..

Gold and Silver prices today : అక్టోబర్​ 12 : మరింత పెరిగిన పసిడి, వెండి ధరలు..

Sharath Chitturi HT Telugu

12 October 2024, 5:25 IST

google News
    • Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు సైతం వృద్ధి చెందాయి. ప్లాటీనం రేట్లు కూడా పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు.. (PTI)

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 77,410కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 77,400గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,74,100గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 70,960కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 70,950గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,09,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,096గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,110గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,560గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 70,960 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 77,410గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 70,960గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,410గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 70,960గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 77,410గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 70,960గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,410గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,010గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 77,460గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 71,960గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,410గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,610గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 96,100కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 96,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,02,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 96,100.. బెంగళూరులో రూ. 89,900గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 570 పెరిగి.. రూ 26,350కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,780గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,350గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం