తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Medicines Price Hike : యాంటీబయాటిక్స్​ నుంచి పెయిన్​కిల్లర్స్​ వరకు.. మందుల ధరలు పెంపు!

Medicines price hike : యాంటీబయాటిక్స్​ నుంచి పెయిన్​కిల్లర్స్​ వరకు.. మందుల ధరలు పెంపు!

Sharath Chitturi HT Telugu

01 April 2024, 13:35 IST

google News
  • Medicine price hike from April 1 : నూతన ఆర్థిక ఏడాది మొదలైన నేపథ్యంలో.. మందుల ధరలు కూడా పెరిగాయి. పూర్తి లిస్ట్​ని ఇక్కడ చూడండి.

పెరిగిన మందుల ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి...
పెరిగిన మందుల ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి...

పెరిగిన మందుల ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి...

Medicine price hike news : నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్ఎల్ఈఎం)లో చేర్చిన మందుల ధరలు నేటి (ఏప్రిల్ 1) నుంచి స్వల్పంగా పెరగనున్నాయి. ఈ జాబితాలోని 800కు పైగా మందుల ధరలపై 0.0055 శాతం ప్రైజ్​ హైక్​ని కంపెనీలు తీసుకోనున్నాయి.

“వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సలహాదారు కార్యాలయం అందించిన హోల్​సేల్​ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) డేటా ఆధారంగా 2022 క్యాలెండర్ ఇయర్​తో పోలిస్తే 2023 క్యాలెండర్ ఇయర్​లో డ​బ్ల్యూపీఐలో వార్షిక మార్పు (+)0.00551 శాతంగా ఉంది,” అని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నోటిఫికేషన్​లో పేర్కొంది.

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న మందుల జాబితా:

డిక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెట్మోల్, మార్ఫిన్ వంటి పెయిన్ కిల్లర్స్ ఏప్రిల్​ 1 నుంచి మంతి ఖరీదుగా మారనున్నాయి.

అమికాసిన్, బెడాక్విలిన్, క్లారిథ్రోమైసిన్ వంటి యాంటీ టీబీ మందులు, క్లోబాజమ్, డయాజెపామ్, లోరాజెపామ్ వంటి యాంటీకాన్వల్సెంట్స్ కూడా ఖరీదైనవిగా మారనున్నాయి.

Medicine price hike list : యాక్టివేటెడ్ చార్కోల్, డి-పెన్సిలమైన్, నలాక్సోన్, స్నేక్ వీనమ్ యాంటీసెరమ్ వంటి విషానికి విరుగుడులు కూడా ఖరీదైనవిగా మారతాయి. అలాగే అమోక్సిసిలిన్, ఆంపిసిలిన్, బెంజిల్పెనిసిలిన్, సెఫాడ్రాక్సిల్, సెఫాజోలిన్, సెఫ్ట్రియాక్సోన్ వంటి యాంటీబయాటిక్స్ ధరలు కూడా పెరగనున్నాయి.

కోవిడ్ మేనేజ్మెంట్ మెడిసిన్స్ ధర కూడా ఈ రోజు నుంచి ఎక్కువగా ఉండబోతోంది.

ఈ మందులపైనా ధరలు పెరగనున్నాయి..

ఫోలిక్ యాసిడ్, ఐరన్ సుక్రోజ్, హైడ్రాక్సోకోబాలమిన్ వంటి రక్తహీనత మందులు; - ఫ్లూనారిజైన్, ప్రొప్రానోలోల్, డోనెపెజిల్ వంటి పార్కిన్సన్స్, చిత్తవైకల్యం మందులు; అబాకవిర్, లామివుడిన్, జిడోవుడిన్, ఎఫావిరెంజ్, నెవిరాపైన్, రాల్టెగ్రావిర్, డోలుటెగ్రావిర్, రిటోనావిర్ వంటి హెచ్ఐవీ మేనేజ్​మెంట్​ మందులు; క్లోట్రిమాజోల్, ఫ్లూకోనజోల్, ముపిరోసిన్, నైస్టాటిన్, టెర్బినాఫిన్ వంటి యాంటీ ఫంగల్ మందులు, డిలిటాజెమ్, మెటోప్రొలోల్, డిగోక్సిన్, వెరాప్రమిల్, అమ్లోడిపైన్, రామిప్రిల్, టెల్మిసార్టెన్ వంటి హృదయనాళ మందులు; మలేరియా మందులైన ఆర్టెసునేట్, ఆర్టెమెథర్, క్లోరోక్విన్, క్లిండమైసిన్, క్వినైన్, ప్రిమాక్విన్; 5-ఫ్లోరోరాసిల్, ఆక్టినోమైసిన్ డి, ఆల్-ట్రాన్స్ రెటినోయిక్ ఆమ్లం, ఆర్సెనిక్ ట్రైఆక్సైడ్, కాల్షియం ఫోలినేట్ వంటి క్యాన్సర్ చికిత్స మందులు; క్లోరోహెక్సిడిన్, ఇథైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పోవిడిన్ అయోడిన్, పొటాషియం పర్మాంగనేట్ వంటి క్రిమినాశక మందులు, సాధారణ మత్తుమందులు, హాలోథేన్, ఐసోఫ్లురేన్, కెటమైన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి ఆక్సిజన్ ఔషధాలపైనా ధరల పెంపు ప్రభావం పడనుంది.

అమ్మో ఏప్రిల్​ 1 తారీఖు..

Changes from April 1 2024 : నూతన ఏడాది ప్రారంభం నేపథ్యంలో ఏప్రిల్​ 1 2024 నుంచి ఆర్థిక వ్యవహారాల పరంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇన్సూరెన్స్ పాలసీ సరెండర్ రూల్స్​లో మార్పులు కనిపిస్తాయి. మూడేళ్లలోపు పాలసీని సరెండర్ చేస్తే సరెండర్ వ్యాల్యూ కంటే తక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రకారం నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలో పనులు చేస్తే సరెండర్ వ్యాల్యూ పెరుగుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం