Messi Gifts to his team: జట్టుకు బంగారు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన మెస్సీ.. వీటి ఖరీదు ఎంతో తెలుసా?-lionel messi gifts golden iphones to his world cup winning team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Messi Gifts To His Team: జట్టుకు బంగారు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన మెస్సీ.. వీటి ఖరీదు ఎంతో తెలుసా?

Messi Gifts to his team: జట్టుకు బంగారు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన మెస్సీ.. వీటి ఖరీదు ఎంతో తెలుసా?

Messi Gifts to his team: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన ప్రపంచకప్ జట్టుకు అరుదైన కానుకలు ఇచ్చాడు. 35 బంగారు ఐఫోన్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. వీటి ఖరీదు వచ్చేసి రూ.1.73 కోట్లుగా అంచనా.

గోల్డ్ ఐఫోన్లు గిఫ్ట్ గా ఇచ్చిన మెస్సీ

Messi Gifts to his team: ఖతర్ వేదికగా గతేడాది జరిగిన ఫిఫా ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా గెలిచిన సంగతి తెలిసిందే. తన చిరకాల స్వప్నాన్ని లియోనల్ మెస్సీ తీర్చుకునేందుకు తీవ్రంగా కృషి చేసి విజయం సాధించిన అతడి కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది. దీంతో ఆ విజయాన్ని అంత సులభంగా మర్చిపోవట్లేదు మెస్సీ. తాజాగా గతేడాది సాధించిన అపురూప విజయానికి గుర్తుగా తన అర్జెంటీనా జట్టు సభ్యులు, సిబ్బందికి అదిరిపోయే కానుకలు ఇచ్చాడు. అవే గోల్డెన్ ఐఫోన్‌లు.

తన జట్టు సభ్యులు, సిబ్బందికి 35 బంగారు ఐఫోన్‌లను గిఫ్ట్‌గా ఇచ్చాడు మెస్సీ. రూ.1.73 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించి వాటిని తన సహచరు ఆటగాళ్లు, సిబ్బందికి కానుకగా అందజేశాడు. గతేడాది డిసెంబరు ఫిఫా ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మెస్సీ ఈ అరుదైన కానుకలను జట్టు సభ్యులకు అందజేశాడు.

ఈ క్రమంలోనే 24 క్యారెట్ల బంగారు స్మార్ట్ ఫోన్‌లను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంపై ఐడిజైన్ గోల్డ్ సంస్థను సంప్రదించాడు. ప్రతి ఫోన్ వెనక భాగంగా సంబంధిత క్రీడాకారుడు, సిబ్బంది పేరు, జెర్సీ నెంబర్, అర్జెంటీనా టీమ్ లోగో, వరల్డ్ కప్ ఛాంపియన్స్ 2022 అని వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. ఇటీవలే ఈ ఫోన్‌లను సదరు సంస్థ డెలివరీ చేసినట్లు స్పష్టం చేసింది. ఆ ఫోన్ల ఫొటోలను పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా వీటిపై విశేషంగా స్పందిస్తున్నారు.

గతేడాది డిసెంబరు జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే ఎట్టకేలకు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా జట్టు విజయం సాధించింది. చివరి వరకు స్కోర్లు సమం కాగా ఫెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో విజయం సాధించడంతో తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు మెస్సీ. గతంలో అర్జెంటీనా జట్టు 1978, 1986లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. తాజాగా మెస్సీ సారథ్యంలో ముచ్చటగా మూడోసారి నెగ్గింది.

సంబంధిత కథనం