తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Epf Withdrawal Clause: కోవిడ్-19 అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేసిన ఈపీఎఫ్ఓ

EPF withdrawal clause: కోవిడ్-19 అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేసిన ఈపీఎఫ్ఓ

HT Telugu Desk HT Telugu

14 June 2024, 14:59 IST

google News
  • EPFO Covid-19 advance: ఈపీఎఫ్ఓ చందాదారులు ఇకపై కోవిడ్ 19 అడ్వాన్స్ ను పొందడం కుదరదు. ఆ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ నిలిపివేసింది. కోవిడ్ -19 ఇకపై మహమ్మారి కానందున, తక్షణమే ఈ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించామని ఈపీఎఫ్ఓ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈపీఎఫ్ నుంచి కోవిడ్ అడ్వాన్స్ ఫెసిలిటీ నిలిపివేత
ఈపీఎఫ్ నుంచి కోవిడ్ అడ్వాన్స్ ఫెసిలిటీ నిలిపివేత

ఈపీఎఫ్ నుంచి కోవిడ్ అడ్వాన్స్ ఫెసిలిటీ నిలిపివేత

EPFO Covid-19 advance: ఈపీఎఫ్ఓ చందాదారులకు ఇకపై కోవిడ్ -19 అడ్వాన్స్ ఇవ్వబోమని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (Employees' Provident Fund Organisation EPFO) తెలిపింది. కోవిడ్ -19 ఇకపై మహమ్మారి కానందున, తక్షణమే ఈ అడ్వాన్స్ ఫెసిలిటీని నిలిపివేయాలని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించిందని ఈపీఎఫ్ఓ (EPFO) ఒక ప్రకటనలో తెలిపింది. మినహాయింపు పొందిన ట్రస్టులకు కూడా ఇది వర్తిస్తుందని, తదనుగుణంగా తమ పరిధిలోకి వచ్చే అన్ని ట్రస్టులకు తెలియజేయవచ్చని తెలిపింది.

గతంలో రెండుసార్లు అవకాశం

గతంలో కోవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులు రెండుసార్లు తమ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉండేది. కోవిడ్ -19 మహమ్మారి మొదటి వేవ్ సమయంలో దీనిని ప్రవేశపెట్టారు. రెండవ వేవ్ లో రెండు సార్లు అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. కోవిడ్ (Covid) అడ్వాన్స్ ఫెసిలిటీ ప్రకారం, ఈపీఎఫ్ఓ చందాదారులు మూడు నెలల పాటు ప్రాథమిక వేతనం, కరువు భత్యానికి మించకుండా నాన్-రిఫండబుల్ అడ్వాన్స్ పొందవచ్చు. చందాదారుడి ఈపీఎఫ్ ఖాతాలో సభ్యుడి క్రెడిట్లో ఉన్న మొత్తంలో 75% వరకు ఏది తక్కువైతే అది పొందవచ్చు.

ఆన్లైన్లో క్లెయిమ్ చేయడం ఎలా?

ఈపీఎఫ్ ఖాతా నుంచి ఆన్ లైన్ లో నగదును ఉపసంహరించుకోవాలనుకునేవారు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  1. ముందుగా యూఏఎన్ (UAN) క్రెడెన్షియల్స్ ఉపయోగించి మెంబర్ ఇంటర్ ఫేస్ కు లాగిన్ అవ్వండి.
  2. సర్వీస్ అర్హత, KYC షరతులను పాటించండి.
  3. సంబంధిత క్లెయిమ్ ఎంచుకోండి.
  4. మీ ఆధార్ తో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్ కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
  5. వివరాలను ధృవీకరించండి. సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  6. మీ ఆన్ లైన్ క్లెయిమ్ ఫారం సబ్మిట్ అవుతుంది.

తదుపరి వ్యాసం