తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooter : 130 కి.మీ రేంజ్​ ఇచ్చే ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై భారీ డిస్కౌంట్​..

Electric scooter : 130 కి.మీ రేంజ్​ ఇచ్చే ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై భారీ డిస్కౌంట్​..

Sharath Chitturi HT Telugu

19 October 2024, 5:55 IST

google News
    • Joy e-bike Mihos : జాయ్​ ఈ బైక్​ మిహోస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై భారీ డిస్కౌంట్​ని ఇస్తోందివార్డ్​విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ సంస్థ. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై భారీ డిస్కౌంట్​..
ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై భారీ డిస్కౌంట్​..

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై భారీ డిస్కౌంట్​..

పండగ సీజన్​లో సేల్స్​ పెంచుకునేందుకు అనేక ఆటోమొబైల్​ కంపెనీలు పోటీపడి మరీ తమ పోర్ట్​ఫోలియో ప్రాడక్ట్స్​పై భారీ డిస్కౌంట్స్​ని ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి వార్డ్​విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ చేరింది. ఈ కంపెనీ తన జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, జాయ్ ఈ-రిక్ త్రీ వీలర్ శ్రేణిలో పండుగ సీజన్ కోసం ఆఫర్లను విడుదల చేసింది. తయారీదారు తన ఫ్లాగ్​షిప్​ ఎలక్ట్రిక్ స్కూటర్ జాయ్ ఈ-బైక్ మిహోస్​పై రూ .30,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.

జాయ్ ఈ-బైక్

జాయ్​ ఈ బైక్​ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ .1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్). గ్లోబ్, జెన్ నెక్ట్స్ నాను, వోల్ఫ్, వోల్ఫ్ ఎకో, వోల్ఫ్ ప్లస్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని కూడా ఈ బ్రాండ్ విక్రయిస్తోంది. వీటి ధరలు రూ .70,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

అంతేకాదు పండగ సమయంలో ఎంపిక చేసిన ఎలక్ట్రిక్​ స్కూటర్లపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ అందించడానికి వార్డ్​విజార్డ్ బ్లూబెల్స్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్​తో కలిసి పనిచేస్తోంది. పండగ సీజన్​లో కొనుగోలును సులభతరం చేయడానికి మంగళం ఇండస్ట్రియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎంఐఎఫ్ఎల్) తో పాటు 15 బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల ద్వారా సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా బ్రాండ్ డీలర్​షిప్స్​, డిస్ట్రిబ్యూటర్లతో పాటు అమెజాన్, ఫ్లిప్​కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్​ఫామ్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఈ ప్రయోజనాలు 2024 నవంబర్ వరకు అందుబాటులో ఉంటాయి.

జాయ్ ఈ-బైక్ మిహోస్ స్పెసిఫికేషన్లు..

జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్​ దాదాపు 130 కి.మీ రేంజ్​. ఫ్యామీలిలకు సరిగ్గా సూట్​ అవుతుంది. దీనిని పాలీ డిసైక్లోపెంటాడిన్ (పీడీసీపీడీ) తో సంస్థ తయారు చేసింది. స్టైలింగ్ అనేది రెట్రో లుక్స్​, కర్వ్​డ్​ బాడ షెల్​తో వస్తుంది. ఈ మోడల్​లో పొడవైన, వెడల్పాటి సీటు ఉంటుంది. సీటు ఎత్తు 750 ఎంఎం వద్ద సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో సింగిల్ స్ప్రింగ్ సస్పెన్షన్​ను కలిగి ఉంది. ఈ మోడల్ 175 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్​తో వస్తుంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్​ఫోన్ కనెక్టివిటీ, రిమోట్ ట్రాకింగ్, రివర్స్ మోడ్, జీపీఎస్ ట్రాకింగ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, హైడ్రాలిక్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్) వంటి ఫీచర్లు మిహోస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఉన్నాయి.

ఇందులోని 1500 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ 95 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఈ-స్కూటర్ కేవలం 7 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని పొందుతుంది. ఈ మోడల్ ఎకో, రైడ్, హై అనే మూడు రైడింగ్ మోడ్ లను పొందుతుంది.

.

తదుపరి వ్యాసం