క్లాసిక్ లుక్ ఇచ్చే మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌లో ‘బాస్’ ఎడిషన్- అదిరిపోయిందంతే!
Mahindra Scorpio Classic price : మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎస్‌యూవీ పండగ సీజన్ వరకే లభిస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్! పండగ సీజన్ నేపథ్యంలో మహీంద్రా క్లాసిక్ ఎస్‌యూవీకి కొత్త ఎడిషన్‌ని సంస్థ లాంచ్ చేసింది. దీని పేరు మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్. డీలర్షిప్ స్థాయిలో యాక్ససరీస్ ద్వారా చేసే కాస్మెటిక్ మార్పులు, ఫీచర్ అడిషన్స్‌తో ఈ మోడల్ రానుంది.
స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ పండుగ సీజన్ కోసం మాత్రమే అమ్మకానికి ఉంటుందని తెలుస్తోంది. ఈలోపే త్వరపడితే బెస్ట్ డీల్స్ లభించొచ్చు! ఈ నేపథ్యంలో ఈ కొత్త ఎడిషన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్: ఎక్స్టీరియర్
ఈ ఎస్‌యూవీలో బానెట్ స్కూప్, ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్, రేర్ రిఫ్లెక్టర్, టెయిల్ ల్యాంప్, డోర్ హ్యాండిల్స్, సైడ్ ఇండికేటర్స్, రేర్ క్వార్టర్ గ్లాస్, హెడ్ల్యాంప్లపై డార్క్ క్రోమ్ గార్నిష్‌తో కొత్త బాస్ ఎడిషన్ వస్తుంది. ఓఆర్వీఎంల కోసం ఫ్రంట్ బంపర్, రెయిన్ వైజర్లు, కార్బన్ ఫైబర్ కవర్లకు యాడ్-ఆన్‌గా అమర్చారు. బ్లాక్ పౌడర్ కోటింగ్ తో ఫినిష్ చేసిన ఈ ఎస్‌యూవీకి రేర్ గార్డ్‌ను కూడా అమర్చారు.
ఇదీ చూడండి:- టయోటా నుంచి పాపులర్ ఎస్‌యూవీ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ ప్రయోజనం
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్: క్యాబిన్..
ఈ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్‌లో ఇప్పుడు వెనుక పార్కింగ్ కెమెరాను అమర్చారు, ఇది పార్కింగ్ ప్రదేశాలలో వాహనాన్ని నడపడానికి సహాయపడుతుంది. అప్హోలిస్టరీని నలుపు రంగులోకి మార్చారు. దానితో పాటు పిల్లో, కుషన్లను కలిగి ఉన్న మహీంద్రా కంఫర్ట్ కిట్ సైతం వస్తుంది.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్: ఇంజిన్..
ఈ మహీంద్రా స్కార్పియో బాస్ ఎడిషన్‌లో 2.2-లీటర్ ఎంహాక్ డీజల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 3,750 ఆర్పీఎమ్ వద్ద 130 బీహెచ్పీ పవర్, 1,600-2,800 ఆర్పీఎమ్ వద్ద 300 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 4×4 డ్రైవ్ ట్రైన్ ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్: కలర్ ఆప్షన్లు..
మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ని సంస్థ ఐదు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. గెలాక్సీ గ్రే, డైమండ్ వైట్, స్టెల్త్ బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్ ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్: ధర..
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ ఎస్ మరియు ఎస్ 11 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధర రూ.13.62 లక్షల నుంచి ప్రారంభమై రూ.17.42 లక్షల వరకు ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ అని గుర్తుపెట్టుకోవాలి.
సంబంధిత కథనం