Internet Effect : ఈ అమెజాన్ తెగ ఇంటర్నెట్‌కు బానిసై వేట మరిచిపోతున్నారు.. ఎప్పుడూ ఫోన్‌లోనే!-this amazon tribe becomes addicted to internet and leave hunting because of phones ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Internet Effect : ఈ అమెజాన్ తెగ ఇంటర్నెట్‌కు బానిసై వేట మరిచిపోతున్నారు.. ఎప్పుడూ ఫోన్‌లోనే!

Internet Effect : ఈ అమెజాన్ తెగ ఇంటర్నెట్‌కు బానిసై వేట మరిచిపోతున్నారు.. ఎప్పుడూ ఫోన్‌లోనే!

Anand Sai HT Telugu
Oct 13, 2024 04:32 PM IST

Internet Effect Marubo Tribe : అమెజాన్ మరుబో తెగ ప్రజలు దశాబ్దం వరకు ఆధునిక ప్రపంచానికి పూర్తిగా దూరంగా నివసించారు. కాని ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వారి ప్రపంచాన్ని పూర్తిగా మార్చింది. పనులకంటే ఇంటర్నెట్‌తోనే సమయం ఎక్కువగా గడుపుతున్నారు.

ఫోన్‌కు బానిసైన అమెజాన్ తెగ
ఫోన్‌కు బానిసైన అమెజాన్ తెగ

ఇంటర్నెట్ ప్రజల జీవితాలను మంచి, చెడు.. ఇలా రెండు మార్గాల్లో ప్రభావితం చేసింది. మారుమూల అమెజాన్ అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు కూడా దాని ప్రభావానికి గురికాకుండా ఉండలేకపోతున్నారు. అమెజాన్ మరుబో తెగ ప్రజలు దశాబ్దం కిందట వరకు ఆధునిక ప్రపంచానికి పూర్తిగా దూరంగా నివసించారు. కాని ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వారి ప్రపంచాన్ని మార్చింది. అడవుల్లో చాలా లోపల స్థిరపడినవారికి 2023 వరకు మొబైల్ ఫోన్లు వచ్చాయి. కాని నెట్వర్క్ లేకపోవడం వల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెద్దగా ప్రభావితం కాలేదు. కానీ ఆ తర్వాత ఎలాన్ మస్క్ తన శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్‌లింక్ ఈ ప్రాంతంలో ప్రయోగించడం ద్వారా మొత్తం కథను మలుపు తిప్పాడు.

ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్టార్‌లింక్ ఈ తెగ గ్రామంలో కొన్ని యాంటెన్నాలను ఏర్పాటు చేసింది. అమెజాన్ అడవి లోపల కూడా మరుబో తెగకు ఇంటర్నెట్‌ను అందించింది. 2023 సెప్టెంబర్లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తెగ ప్రజల జీవితాలు చాలా వేగంగా మారిపోయాయి.

ఈ గ్రామంలోని ప్రజల వద్ద అప్పటికే ఫోన్లు ఉన్నాయి. అయితే ఇంటర్నెట్ లేకపోవడంతో అప్పుడప్పుడు ఫొటోలు తీయడానికి, మాట్లాడుకోవడానికి మాత్రమే వాటిని ఉపయోగించేవారు. అయితే స్టార్‌‌లింక్ ఇక్కడికి వచ్చాక వారి జీవితాలు మారిపోయాయి. 'మా తెగలోని ప్రజలు చాలా సంతోషంగా జీవించారు.' అని అదే తెగకు చెందిన సిగ్నామా మరుబో చెప్పారు. ఇప్పుడు రోజంతా పని మానేసి మొబైల్ ఫోన్లలో నిమగ్నమయ్యారు. పని చేయాల్సిన యువత ఇంటర్నెట్ కారణంగా సోమరిపోతులైపోతున్నారు. మూలాలకు దూరమవుతున్నారు. యువత ఫోన్లలో అశ్లీల వీడియోలు చూస్తున్నారని, ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెగ నాయకుడు ఆల్ఫ్రెడో మరుబో చెప్పారు.

ఇంటర్నెట్ యువత, పిల్లల జీవనశైలిని మార్చేసిందని, ఇది తెగకు ముప్పుగా పరిణమించిందని, ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి యువతకు వ్యవసాయం, వేటపై ఆసక్తి లేదని అక్కడి సామాన్యులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ వల్ల గిరిజన ప్రజలకు ఎంతో మేలు జరిగినా అనేక దుర్వినియోగాలు జరుగుతున్నాయని ఓ నివేదిక పేర్కొంది. ఈ కారణంగా కంపెనీ వైపు నుంచి రోజులో కొన్ని గంటలు ఇంటర్నెట్ నిలిపివేస్తున్నారు. ఇంటర్నెట్ కారణంగా చాలా సార్లు మోసాలు కూడా వెలుగులోకి వస్తున్నాయని, వారికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెగ నాయకులు తెలిపారు. నిత్యం అశ్లీల వీడియోలు, హింసాత్మక వీడియో గేమ్స్ చూస్తున్నారు. యువకులు గిరిజన జీవితం కంటే బయటి జీవితంలో తమ ఆనందాన్ని ఎక్కువగా చూస్తున్నారు. అడవిని విడిచి బయటకు వెళుతున్నారు.

ఇంటర్నెట్ యాక్సెస్ ను తొలగించాలని తాము చెప్పడం లేదని మరుబో తెగకు చెందిన త్సైనామా మరుబో అన్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ సహాయంతో కొందరి ప్రాణాలను కూడా కాపాడగలిగామని, మనం కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఇంటర్నెట్ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Whats_app_banner

టాపిక్