Nara Rohit: ప్రతినిధి 2 హీరోయిన్‌తో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్ - ఫొటోలు వైరల్
Nara Rohit: ప్రతినిధి 2 హీరోయిన్ సిరి లెల్లతో టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఏం నారా చంద్రబాబునాయుడితో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Nara Rohit: టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడుకాబోతున్నాడు. ప్రతినిధి 2 హీరోయిన్ సిరి లెల్ల మెడలో త్వరలో మూడుముళ్లు వేయబోతున్నాడు. నారా రోహిత్, సిరి లెల్ల ఎంగేజ్‌మెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది.
ఈ నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఏం చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నారా రోహిత్, సిరి లెల్ల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ప్రతినిధి 2 మూవీలో...
ఈ ఏడాది మే నెలలో రిలీజైన ప్రతినిధి 2 మూవీలో నారా రోహిత్‌కు జోడీగా సిరి లెల్ల నటించింది. ఈ మూవీతోనే సిరి లెల్ల హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నారా రోహిత్, సిరి లెల్ల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు ప్రచారం జరుగుతోంది.
పెద్దల అంగీకారంతోనే వీరి పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం. త్వరలోనే నారా రోహిత్, సిరి లెల్ల తమ పెళ్లి డేట్‌ను అఫీషియల్‌గా వెల్లడించబోతున్నట్లు తెలిసింది.
బాణం మూవీతో హీరోగా ఎంట్రీ...
బాణం మూవీతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. సోలో, రౌడీఫెలో, ప్రతినిధి, జ్యో అచ్యుతానంద సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కెరీర్‌లో ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేశాడు నారా రోహిత్. పరాజయాల కారణంగా దాదాపు ఆరేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న నారా రోహిత్ ప్రతినిధి 2 మూవీతోనే రీఎంట్రీ ఇచ్చాడు.
పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ నారా రోహిత్‌కు కమర్షియల్‌గా విజయాన్ని అందించలేకపోయినా అతడికి జీవితభాగస్వామిని మాత్రం పరిచయం చేసిందని నెటిజన్లు చెబుతోన్నారు. ప్రతినిధి 2 మూవీకి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నాడు.
సుందరకాండ...
ప్రస్తుతం సుందరకాండ పేరుతో రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తోన్నాడు నారా రోహిత్. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో శ్రీదేవి విజయ్‌కుమార్, విర్తి వాఘవి హీరోయిన్లుగా నటిస్తోన్నారు. షూటింగ్ పూర్తయిన ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నారా రోహిత్ ఏపీ సీఏం నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి కుమారుడు కావడం గమనార్హం.