తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Dimeadozen : రూ. 1.2కోట్లకు అమ్మడుపోయిన రూ. 15వేల స్టార్టప్​..!

DimeADozen : రూ. 1.2కోట్లకు అమ్మడుపోయిన రూ. 15వేల స్టార్టప్​..!

Sharath Chitturi HT Telugu

23 October 2023, 18:19 IST

    • DimeADozen : రూ. 15వేలతో మొదలైన ఓ స్టార్టప్​.. ఏకంగా రూ. 1.2కోట్లకు అమ్ముడుపోయింది! ఫలితంగా స్టార్టప్​ ఫౌండర్స్​కి భారీ లాభాలు వచ్చాయి.
రూ. 1.2కోట్లకు అమ్మడుపోయిన రూ. 15వేల స్టార్టప్​!
రూ. 1.2కోట్లకు అమ్మడుపోయిన రూ. 15వేల స్టార్టప్​!

రూ. 1.2కోట్లకు అమ్మడుపోయిన రూ. 15వేల స్టార్టప్​!

DimeADozen : ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ని ఉపయోగించుకుని.. ఇద్దరు స్నేహితులు అద్భుతాన్ని చేశారు! రూ. 15వేలకు ఓ స్టార్టప్​ను సృష్టించి.. దానిని ఏకంగా రూ. 1.2కోట్లక విక్రయించి, భారీ లాభాలను వెనకేసుకున్నారు. అసలు కథలోకి వెళితే..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

చాట్​ జీపీటీని ఉపయోగించుకుని..

సాల్వెటార్​ ఐఎల్లోకు ఇంజినీరింగ్​ స్ట్రీమ్​లో 17ఏళ్ల అనుభవం ఉంది. దశాబ్ద కాలం పాటు ఆయన స్టార్టప్​ ఫండర్​గాను, సీటీఓగాను పనిచేశారు. మరోవైపు మానిక పవర్స్​.. 15ఏళ్ల పాటు అనేక రంగాల్లో సక్సెస్​ సాధించారు. ప్రారంభ దశలో ఉన్న అనేక సంస్థలను శిఖరానికి తీసుకెళ్లారు.

ఈ ఇద్దరు స్నేహితులు సృష్టించిందే ఈ 'డైమ్​ఏడజన్​'. ఇదొక ఏఐ-పవర్డ్​ టూల్​. చాట్​జీపీటీ నుంచి ఇది పుట్టుకొచ్చింది! బిజినెస్​ ఐడియాలను తీసుకుని డీటైల్డ్​గా నివేదికలు రూపొందించడం ఈ టూల్​ పని. ఒక బిజినెస్​లో ఎలాంటి వారు ఇన్​వెస్ట్​ చేస్తారు? ఎవరు కస్టమర్లుగా ఉంటారు? ఎవరి నుంచి పోటీ ఎదురవుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

DimeADozen news : ఐఎల్లో, మానిక పవర్స్​.. ఓ రోజు చాట్​జీపీటీ వాడుతుండగా ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. బిజినెస్​ ఐడియాలను సింప్లిఫై చేసేందుకు ఎదైనా టూల్​ని కనుక్కోవాలని వారు భావించారు. అలా.. డైమ్​ఎడజన్​ ఆవిర్భవించింది. ఓ ఫార్మ్​లో ప్రజలు తమ ఐడియాలను షేర్​ చస్తే.. స్మార్ట్​ మాథ్​ను ఉపయోగించి, ఈ టూల్​.. కొన్ని రిపోర్టులను తయారు చేస్తుంది. ఇందులో సమగ్ర సమాచారం ఉంటుంది.

ఇలా కేవలం 185 డాలర్లతో (సుమారు రూ. 15వేలు) ఈ డైమ్​ఎడజన్​ స్టార్టప్​ను స్థాపించారు ఇద్దరు స్నేహితులు. ఇది అంచెలంచెలుగా ఎదిగింది. ప్రక్రియ సింపుల్​గా, ఫాస్ట్​గా ఉండటంతో.. వెంటనే మంచి పేరు తెచ్చుకుంది. 'వ్యాపార రంగంలో ఎదైనా సమాచారం తెలుసుకోవాలంటే..డైమ్​ఎడజన్​ వాడాల్సిందే..' అనే రేంజ్​కు ఎదిగింది. 7 నెలల్లోనే వీరు 66వేల డాలర్లు సంపాదించారు.

ChatGPT latest news : ఒక కంపెనీ ఇంత వేగంగా వృద్ధి చెందుతుంటే పెట్టుబడులు రావడం సహజం. కానీ ఇక్కడ ఈ ఇద్దరి జీవితాలు పూర్తిగా మారిపోయింది! ఫెలిపె అరోసెమెన, డానెల్లె డే కార్నిలియా దంపతులు.. ఈ స్టార్టప్​ను 1,50,000 డాలర్లకు కొనుగోలు చేశారు. ఇండియన్​ కరెన్సీలో ఇది రూ. 1.2కోట్ల కన్నా ఎక్కువే! కంపెనీని అమ్మేసినప్పటికీ.. మానిక, ఐఎల్లోలు దానికి సలహదారులుగా కొనసాగనున్నారు.

తదుపరి వ్యాసం