తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Startups : ఆ స్టార్టప్స్ కోసం.. ట్రూకాలర్, వీహబ్ ఎంవోయూ

Telangana Startups : ఆ స్టార్టప్స్ కోసం.. ట్రూకాలర్, వీహబ్ ఎంవోయూ

Anand Sai HT Telugu

22 August 2022, 16:28 IST

google News
    • Startups In Telangana : తెలంగాణలోని మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు మద్దతుగా ట్రూకాలర్, WeHub అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ వ్యాప్తంగా మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు గ్లోబల్ కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్ ట్రూకాలర్, Wehub అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశాయి. WEHub CEO దీప్తి రావుల, Truecaller పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ ప్రగ్యా మిశ్రా ఎంవోయూపై సంతకాలు చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ నేతృత్వంలో ఒప్పందం జరిగింది.

ట్రూకాలర్ తన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK)ని స్టార్టప్‌లకు విస్తరింపజేస్తుంది. SDK.. ధృవీకరణ మౌలిక సదుపాయాలను త్వరగా రూపొందించడంలో డెవలపర్లకు సహాయం చేస్తుంది. రాబోయే స్టార్టప్‌లు, వాటి సేవలను ప్రోత్సహించడానికి Truecaller $ 25,000 విలువైన ప్రకటన క్రెడిట్‌లను అందిస్తుంది. WEHub, Truecaller పరస్పరం ప్రకటనలపై హ్యాకథాన్‌లను నిర్వహిస్తాయి. Truecaller ద్వారా బహుమతులు స్పాన్సర్ చేస్తారు. రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు మెంటర్‌షిప్, అవసరమైన మద్దతు అందిస్తారు.

'తెలంగాణ ప్రభుత్వం ఎంటిటీల మధ్య సహకారానికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది. రాష్ట్రంలో స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చేందుకు ముందుగా ఉంటుంది. కొత్తగా జరిగిన ఒప్పందం.. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా ఉంటుంది.' అని జయేశ్ రంజన్ అన్నారు.

'వినూత్న ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి స్కేల్ అప్ స్కేల్‌తో మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి ట్రూకాలర్‌తో సహకరించడానికి మేం సంతోషిస్తున్నాం. ఇది ఆవిష్కరణలకు నాయకత్వం వహించడానికి, వారి ఉత్పత్తుల ప్రమోట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.'అని దీప్తి రావుల అన్నారు. WEHub నేతృత్వంలో 238 టెక్నాలజీ-ఎనేబుల్ స్టార్టప్‌లను మహిళలు ప్రారంభించారు.

తదుపరి వ్యాసం