Citroen C3 Aircross price : హైదరాబాద్‌లో సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఇదే!
22 September 2023, 15:26 IST
- Citroen C3 Aircross price : సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే హైదరాబాద్‌లో ఈ మోడల్ ఆన్ రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఇదే!
Citroen C3 Aircross on road price in Hyderabad : సిట్రోయెన్ సంస్థ నుంచి ఇటీవలే లాంచ్ అయిన సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్యూవీ.. కస్టమర్లను ఆకర్షిస్తోంది. 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లో వస్తున్న ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ మోడల్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఇండియాలో ఈ ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధర రూ. 9.99లక్షలు నుంచి రూ. 12.10లక్షల మధ్యలో ఉంది. ఇక హైదరాబాద్‌లో సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు ఇలా ఉన్నాయి..
- సీ3 ఎయిర్‌క్రాస్ యూ (5 సీటర్):- 11.26లక్షలు
- సీ3 ఎయిర్‌క్రాస్ ప్లస్ (5 సీటర్):- రూ. 11.30లక్షలు
- సీ3 ఎయిర్‌క్రాస్ ప్లస్ (7 సీటర్):- రూ. 11.65లక్షలు
- సీ3 ఎయిర్‌క్రాస్ మ్యాక్స్ (5 సీటర్):- రూ. 11.95లక్షలు
- సీ3 ఎయిర్‌క్రాస్ మ్యాక్స్ (7 సీటర్):- రూ. 12.30లక్షలు
ఇదీ చూడండి:- C3 Aircross vs Rumion : సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ వర్సెస్ టయోటా రుమియన్- ఏది బెస్ట్?
డెలివరీలు ఎప్పుడంటే..
అక్టోబర్ 15 నుంచి ఈ ఎస్యూవీ డెలివరీలు మొదలుపెట్టాలని సంస్థ ప్లాన్ చేస్తోంది. రూ. 25వేల టోకెన్ అమౌంట్‌తో సంస్థకు చెందిన వెబ్సైట్ లేదా డీలర్షిప్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇండియాలో.. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో 3- రో సీటింగ్ ఆప్షన్ కలిగి ఉన్న తొలి వెహికిల్ ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ కావడం విశేషం.
Citroen C3 Aircross price : కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, వోక్స్వ్యాగన్ టైగున్, స్కోడా కుషాక్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజ్ హైరైడర్, హోండా ఎలివేట్ వంటి మోడల్స్‌కు ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్.. గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌లో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ ఓఆర్వీఎంలు, టీపీఎంఎస్, రేర్ వైపర్ విత్ వాషర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, 2-3 రోలకు రూఫ్ మౌంటెడ్ ఎయిర్ కాన్ వెంట్స్, రేర్ డీఫాగర్ వంటివి వస్తున్నాయి. 6 ఎయిర్బాగ్స్ దీని సొంతం.
ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 1008 హెచ్‌పీ పవర్‌ను, 190ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మోనోటోన్, డ్యూయెల్ టోన్ సహా మొత్తం 10 రంగుల్లో ఈ ఎస్యూవీ అందుబాటులో ఉండనుంది.