తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Rumion Price : హైదరాబాద్​లో టయోటా రుమియన్​ ఆన్​రోడ్​​ ప్రైజ్​ వివరాలివే!

Toyota Rumion price : హైదరాబాద్​లో టయోటా రుమియన్​ ఆన్​రోడ్​​ ప్రైజ్​ వివరాలివే!

Sharath Chitturi HT Telugu

01 September 2023, 8:05 IST

    • Toyota Rumion on road price in Hyderabad : టయోటా రుమియన్​లో మూడు వేరియంట్లు ఉన్నాయి. హైదరాబాద్​లో వీటి ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హైదరాబాద్​లో టయోటా రుమియన్​ ఆన్​రోజ్​ ప్రైజ్​ వివరాలివే!
హైదరాబాద్​లో టయోటా రుమియన్​ ఆన్​రోజ్​ ప్రైజ్​ వివరాలివే!

హైదరాబాద్​లో టయోటా రుమియన్​ ఆన్​రోజ్​ ప్రైజ్​ వివరాలివే!

Toyota Rumion on road price in Hyderabad : రుమియన్​ ఎంపీవీ ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టయోటా. మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా దీనిని రూపొందించింది. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలతో పాటు హైదరాబాద్​లో రుమియన్​ ఎంపీవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

కొత్త వెహికిల్​ ధర ఎంతంటే..?

హైదరాబాద్​లో రుమియన్​ ఎస్​ వేరియంట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 12.76లక్షలుగా ఉంది. జీ వేరియంట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 14.17లక్షలు, వీ వేరియంట్​ రూ. 15.06లక్షలుగా ఉన్నాయి.

కాగా.. టయోటా రుమియన్​ ఎంపీవీలో ఎస్​ ఎంటీ (పెట్రోల్​) ఎక్స్​షోరూం ధర రూ. 10.29లక్షలుగా, ఎస్​ ఏటీ (పెట్రోల్​) ధర రూ. 11.89లక్షలుగా ఉంది. జీ ఎంటీ (పెట్రోల్​) ఎక్స్​షోరూం ప్రైజ్​ రూ. 11.45లక్షలుగాను, వీ ఎంటీ (పెట్రోల్​) ధర రూ. 12.18లక్షలుగా ఉంది. వీ ఏటీ (పెట్రోల్​) ఎక్స్​షోరూం ధర రూ. 13.68లక్షలుగా ఉంది.

ఇదీ చూడండి:- Toyota Rumion vs Maruti Suzuki Ertiga : సేమ్​ సేమ్​ బట్​ డిఫరెంట్​.. రుమియన్​- ఎర్టిగాల్లో తేడా ఏంటి? ఏది కొనాలి?

Toyota Rumion price : ఇందులో సీఎన్​జీ ఆప్షన్​ కూడా. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 11.24లక్షలు

టయోటా రుమియన్​ బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 11వేల టోకెన్​ అమౌంట్​తో సంస్థకు చెందిన డీలర్​షిప్​ షోరూమ్​లో ఈ వెహికిల్​ను బుక్​ చేసుకోవచ్చు. ఈ నెల 8 నుంచి డెలివరీలు మొదలవుతాయని సంస్థ చెప్పింది.

కొత్త ఎంపీవీలో ఇంజిన్​ ఇలా..

Toyota Rumion price in India : ఈ 7 సీటర్​ వెహికిల్​లో 1.5 లీటర్​ కే సిరీస్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. దీని మైలేజ్​ 20.51 కేఎంపీహఎల్​. ఈ ఇంజిన్​. 101 బీహెచ్​పీ పవర్​ను, 136.8 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. సీఎన్​జీ ఆప్షన్​ మైలేజ్​ 26.11 కేఎం/కేజీ.

రుమియన్​లో 5 కలర్​ ఆప్షన్స్​ వస్తున్నాయి. అవి స్పంకీ బ్లూ, రస్టిక్​ బ్రౌన్​, ఐకానిక్​ గ్రే, కేఫ్​ వైట్​, ఎంటైసింగ్​ సిల్వర్​.

తదుపరి వ్యాసం