Rumion vs Ertiga : సేమ్ సేమ్ బట్ డిఫరెంట్.. రుమియన్- ఎర్టిగాల్లో తేడా ఏంటి? ఏది కొనాలి?
Toyota Rumion vs Maruti Suzuki Ertiga : టయోటా రుమియన్, మారుతీ సుజుకీ ఎర్టిగాల మధ్య తేడా ఏంటి? ఇక్కడ తెలుసుకుందాము..
Toyota Rumion vs Maruti Suzuki Ertiga : టయోటా రుమియన్‌ని తాజాగా ఇండియాలో లాంచ్ చేసింది జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఇది.. మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా రూపొందించిన ఏంపీవీ అన్న విషయం తెలిసిందే. అయితే రెండింట్లోనూ కొన్ని మార్పులు ఉన్నాయి. వాటిని పరిశీలించి, ఈ రెండు వెహికిల్స్‌లో ఏది కొనాలి? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
రెండు వెహికిల్స్‌లో కనిపించే మార్పులు ఇవే..
రుమియన్- ఎర్టిగాలను చూస్తే.. ముందుగా కనిపించే డిఫరెన్స్.. ఫ్రెంట్ గ్రిల్. రుమియన్ ఫ్రెంట్ గ్రిల్లో మార్పులు చేసింది టయోటా సంస్థ. ఇందులో క్రోమ్ సరౌండింగ్‌తో కూడిన మెష్ పాటర్న్ గ్రిల్ వస్తోంది. మారుతీ సుజుకీ ఎర్టిగా ఫ్రెంట్ గ్రిల్ సెంటర్లో క్రోమ్ ట్రిమ్స్ వస్తాయి.
Toyota Rumion on road price Hyderabad : ఇక రుమియన్ ఫ్రెంట్ బంపర్‌ను పూర్తిగా మార్చేసింది టయోటా సంస్థ. ఇందులో బ్రష్డ్ అల్యుమీనియం ఇన్సర్ట్స్ వస్తున్నాయి. ఫాగ్ ల్యాంప్ హౌజింగ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది.
రుమియన్- ఎర్టిగాల్లో 15 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. కాకపోతే.. రుమియన్ వీల్స్ డిజైన్‌లో మార్పు కనిపిస్తుంది. ఇవి చాలా స్టైలిష్‌గా ఉన్నాయి.
ఇదీ చూడండి:- Toyota Rumion vs Kia Carens : రుమియన్ వర్సెస్ క్యారెన్స్.. ఏది బెస్ట్?
Maruti Suzuki Ertiga on road price Hyderabad : మారుతీ సుజుకీ ఎర్టిగాలో 7 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. అవి.. డిగ్నిటీ బ్రౌన్, మాగ్మా గ్రే, ఆక్స్ఫర్డ్ బ్లూ, ఔబర్న్ రెడ్, స్పెండిడ్ సిల్వర్, ఆర్కెటిక్ వైట్, మిడ్నైట్ బ్లాక్. ఇక రుమియన్‌లో కేవలం 5 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. అవి స్పంకీ బ్లూ, రస్టిక్ బ్రౌన్, ఐకానిక్ గ్రే, కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్.
ఇక కేబిన్ విషయానికొస్తే.. టయోటా రుమియన్‌లో గ్రే షేడ్స్ వస్తున్నాయి. ఎర్టిగాలో డ్యూయెల్ టోన్ (బైగ్- బ్లాక్) రంగు ఉంటుంది. వీటికి మంచి.. ఇంటీరియర్‌లో రెండు వాహనాల్లో పెద్దగా మార్పులు ఉండవు. ఈ రెండు ఎంపీవీల్లో వాడే ఇంజిన్ ఒకటే!
టయోటా రుమియన్ వేరియంట్లు- వాటి ధరలు..
Toyota Rumion MPV price in India : రుమియన్‌లో మొత్తం 6 వేరియంట్లు ఉన్నాయి.
ఎస్ ఎంటీ (పెట్రోల్)- రూ. 10.29లక్షలు
ఎస్ ఏటీ (పెట్రోల్)- రూ. 11.89లక్షలు
జీ ఎంటీ (పెట్రోల్)- రూ. 11.45లక్షలు
వీ ఎంటీ (పెట్రోల్)- రూ. 12.18లక్షలు
వీ ఏటీ (పెట్రోల్)- రూ. 13.68లక్షలు
ఎస్ ఎంటీ (సీఎన్జీ)- రూ. 11.24లక్షలు
హైదరాబాద్‌లో రుమియన్ ఆన్‌రోడ్ ప్రైజ్‌కు సంబంధించిన వివరాలపై ఇంకా క్లారిటీ లేదు.
సంబంధిత కథనం