Citroen Basalt : టాటా కర్వ్‌కి పోటీగా వస్తున్న సిట్రోయెన్ బసాల్ట్ ఇదే..
26 July 2024, 5:34 IST
- Citroen Basalt launch date : సిట్రోయెన్ బసాల్ట్ ఎస్యూవీ కూపేని సంస్థ తాజాగా ఆవిష్కరించింది. టాటా కర్వ్‌కి పోటీగా వస్తున్న ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇదిగో సిట్రోయెన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే..
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త సెగ్మెంట్ పుట్టుకొస్తోంది! అదే.. ఎస్యూవీ కూపే. టాటా మోటార్స్ నుంచి టాటా కర్వ్ ఎస్యూవీ కూపే వచ్చే నెలలో లాంచ్‌కు రెడీ అవుతోంది. ఇక కర్వ్‌కు పోటీగా సిట్రోయెన్ సంస్థ నుంచి ఒక కొత్త ఎస్యూవీ కూపే రెడీ అవుతోంది. దాని పేరు సిట్రోయెన్ బసాల్ట్. ఈ మోడల్ని పూర్థిస్థాయిలో సంస్థ తాజాగా ఆవిష్కరించింది. బసాల్ట్, కర్వ్‌లు భారతదేశంలో అత్యంత సరసమైన ఎస్యూవీ కూపేగా నిలిచిపోనున్నాయి. కొన్ని డీలర్‌షిప్‌లు ఇప్పటికే బసాల్ట్ కోసం బుకింగ్ లను స్వీకరించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో బసాల్ట్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
బసాల్ట్ ఎస్యూవీ కూపే..
ఈ సిట్రోయెన్ బసాల్ట్ రూఫ్‌లైన్ ట్రంక్ లిడ్ వరకు విస్తరించి ఉంది. ఫెండర్ ఫ్లేర్స్, ప్లాస్టిక్ క్లాడింగ్ ఉన్నాయి. ఈ హెడ్‌ల్యాంప్‌లు సీ3 ఎయిర్‌క్రాస్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ముందు భాగంలో చంకీ బంపర్, వెనుక భాగంలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో పాటు కొత్త టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇరువైపులా, కొత్త అల్లాయ్ వీల్స్ వస్తున్నాయి.
సిట్రోయెన్ డిజైన్ హెడ్ పియరీ లెక్లెర్క్ మాట్లాడుతూ.. “న్యూ సిట్రోయెన్ బసాల్ట్ ఒక కొత్త రకం సిల్హౌట్. ఇది భారతదేశంలో సీ3, సీ3 ఎయిర్క్రాస్లకు అనుబంధంగా ఉంటుంది. ఇది రెండు ప్రపంచాలలో ఉత్తమమైన వాటిని తీసుకువస్తుంది. అవి.. ఎస్యూవీ దృఢత్వం, కూపే ఎఫీషియెన్సీ, సామర్థ్యం. బసాల్ట్ నిష్పత్తులు ఎస్యూవీ కోడ్ల బలాన్ని, దాని ఫెండర్లు, క్లాడింగ్ లతో మిళితం చేస్తాయి. అయితే దాని ఫాస్ట్ బ్యాక్ సిల్హౌట్ కూపే స్టైలింగ్ తెస్తుంది,” అని అన్నారు.
సిట్రోయెన్ బసాల్ట్: ఫీచర్లు..
తాజా అధికారిక ప్రివ్యూలు సిట్రోయెన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే లోడెడ్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుందని ధృవీకరించాయి. వైబ్రెంట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, కప్ హోల్డర్లతో నిండిన ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్‌రెస్ట్, అలాగే వెనుక భాగంలో ఉన్న ఫోన్ హోల్డర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. టైప్-సీ ఛార్జింగ్ పోర్టులు, వైర్లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలు, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉంటాయి.
సిట్రోయెన్ బసాల్ట్: ఇంజిన్ వివరాలు..
సిట్రోయెన్ బసాల్ట్ 1.2-లీటర్ మూడు సిలిండర్ల, టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 109 బీహెచ్పీ పవర్, 205 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
టాటా కర్వ్ ఆగస్ట్‌లో లాంచ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ సిట్రోయెన్ బసాల్ట్ లాంచ్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఎస్యూవీ కూపే ధరకు సంబంధించిన వివరాలపైనా ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ బసాల్ట్ని సిట్రోయెన్ ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తోంది. దీనితో సంస్థ సేల్స్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది.