Car paint protection tips : మీ కారు పెయింట్‌ను పదిలంగా చూసుకోండి ఇలా..!
16 October 2023, 12:50 IST
- Car paint protection : కొత్త కారు కొన్నారా? అయితే ఇది మీకోసమే..! కారు పెయింట్‌ను ఎలా పదిలంగా చూసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాము..
మీ కారు పెయింట్‌ను పదిలంగా చూసుకోండి ఇలా..!
Car paint protection : కొత్తగా కారు కొనే వారు.. 4 వీలర్ మోడల్స్‌ని చూడటంతో పాటు వాటి రక్షణకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా.. కారుకు పెయింట్ పోతే.. రిప్లేస్ చేసేందుకు చాలా ఖర్చు అవుతుంది. అందుకే.. కొన్ని టిప్స్ పాటిస్తే.. కారు పెయింట్‌ను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఆ టిప్స్ మీకోసం..
ముందు.. కారు కవర్ కొనండి!
కారు పెయింట్‌ను పదిలంగా చూసుకోవాలంటే.. ముందు చేయాల్సిన పని ఓ కవర్ కొనడం! ఇతర ఆప్షన్స్‌తో పోల్చితే దీని ధర కూడా తక్కువే. ఎండ, వాన, చలి నుంచి ఇది వాహనాన్ని కాపాడుతుంది. అయితే కవర్ కొనే ముందు సైజును ఒకటికి రెండుసార్లు చూసుకోండి. సరిగ్గా ఫిట్ అయ్యే కవర్నే తీసుకోవాలి.
పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ వాడాలి..
Car paint protection film : కారు పెయింట్‌ను స్క్రాచ్‌లు, సన్‌లైట్, ఇతర హానికరమైన పదార్థాల నుంచి కాపాడేందుకు పీపీఎఫ్ (పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్) యూజ్ అవుతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ ఎఫెక్టివ్ అని చెప్పుకోవాలి. సిరామిక్, వాక్స్ కన్నా ఇది చాలా ఎక్కువ కాలం నిలుస్తుంది. పైగా.. ప్రొఫెషనల్స్ మాత్రమే దీనిని కారుకు వేయగలరు!
వాక్సింగ్ చేయాలి..
Tips for car paint work : కారును వాష్ చేసిన తర్వాత.. దానిని వాక్సింగ్ చేయిస్తే బెటర్. ఫలితంగా పెయింట్ మీద దమ్ము, కాలుష్యం, నీరుతో పాటు హానికరమైన పదార్థాలు పడకుండా ప్రొటెక్షన్ లభిస్తుంది. వాక్సింగ్ బాగా చేస్తే చిన్నపాటి స్క్రాచ్‌లు కూడా కవర్ అయిపోతాయి. సరైన టెక్నిక్‌లు వాడి కొన్ని నెలలకు ఓసారి వాక్సింగ్ చేయిస్తే మంచిది.
సిరామిక్ కోటింగ్ బెటర్..!
car paint protection tips : వాక్స్‌కు ప్రత్యామ్నాయంగా సిరామిక్ కోటింగ్‌ను వాడొచ్చు. కారు పెయింట్‌కు దీనితో రక్షణ లభిస్తుంది. వాహనంపై వాక్స్ కన్నా ఇది ఎక్కువ కాలం ఉండటం గమనార్హం. సరిగ్గా వాడితే ఇది ఏడాది కాలం వరకు ఉంటుంది. నాణ్యమైన సిరామిక్ కోటింగ్‌తో మీ కారు కొత్తగా కనిపిస్తుంది.
సింథెటిక్ పెయింట్ సీలెంట్ గురించి విన్నారా?
ఈ సింథెటిక్ సీలెంట్స్లో వివిధ కెమికల్స్ ఉంటాయి. వీటితో కారుకు గ్లాసీ షైన్ వస్తుంది. యూవీ కిరణాలు, స్క్రాచ్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. మీ అంతట మీరే అప్లై చేయడం కన్నా.. మెకానిక్ దగ్గరకు వెళ్లడం మంచిది. మెకానిక్స్ దగ్గర టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. ఏడాది పాటు ఇది పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్లీ మార్చుకోవాల్సి ఉంటుంది.