తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Electric Bike : ఈ స్టైలిష్​ ఎలక్ట్రిక్​ బైక్​ రేంజ్​ చాలా ఎక్కువ! ప్రైజ్​ చెక్​ చేయండి..

Best Electric bike : ఈ స్టైలిష్​ ఎలక్ట్రిక్​ బైక్​ రేంజ్​ చాలా ఎక్కువ! ప్రైజ్​ చెక్​ చేయండి..

Sharath Chitturi HT Telugu

21 October 2024, 12:20 IST

google News
    • Matter Aera 5000 : మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్​ బైక్​కి మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ బైక్​ ఫీచర్స్​, ధర, రేంజ్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
స్టైలిష్​ ఎలక్ట్రిక్​ బైక్​- రేంజ్​, ధర వివరాలివే..
స్టైలిష్​ ఎలక్ట్రిక్​ బైక్​- రేంజ్​, ధర వివరాలివే.. (Matter)

స్టైలిష్​ ఎలక్ట్రిక్​ బైక్​- రేంజ్​, ధర వివరాలివే..

ఇండియాలో ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ సెగ్మెంట్​కి మంచి డిమాండ్​ ఉంది. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్​ 2 వీలర్స్​పై కస్టమర్లు అధికంగా ఫోకస్​ చేస్తున్నారు. అందుకే ఆటోమొబైల్​ సంస్థలు పోటీపడి కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేస్తున్నాయి. వీటిల్లో మ్యాటర్​ ఎరా ఎలక్ట్రిక్​ బైక్​కి మంచి గుర్తింపు లభిస్తోంది. అహ్మదాబాద్​కు చెందిన మ్యాటర్ గ్రూప్ ఈ ఈ-బైక్​కి చెందిని డెలివరీలను సైతం ఇటీవలే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ బైక్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మ్యాటర్ ఎరా బైక్​..

మాన్యువల్ గేర్ షిఫ్టింగ్ సిస్టమ్ కలిగిన ఏకైక ఎలక్ట్రిక్ బైక్​ ఈ మ్యార్​ ఎరా. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అవి మ్యాటర్​ ఎరా 5000, మ్యాటర్​ ఎరా 5000+. వీటి ధరలు వరుసగా రూ .1.74 లక్షలు, రూ .1.84 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ అని గుర్తుపెట్టుకోవాలి.

ఈ బైక్​లో తయారీదారు రాబోయే సంవత్సరంలో రెండు అదనపు వేరియంట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. 5000, 5000+ మోడళ్లు రెండూ 10 కిలోవాట్ల (13.4 బీహెచ్​పీ) ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తాయి. ఇది కేవలం ఆరు సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫీచర్ల విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్​ బైక్​లో 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​ కన్సోల్ ఉంది. ఇది నావిగేషన్, సంగీతం, కాల్స్, ఇతర ఫంక్షనాలిటీలను అందిస్తుంది. మ్యాటర్​ ఎరా ఎలక్ట్రిక్​ బైక్​ని ఏదైనా ప్రామాణిక 5-యాంప్ సాకెట్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. ఇది అందుబాటులో ఉన్న ఏదైనా అవుట్లెట్​లో ప్లగ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ నిర్వహణ వ్యయం కిలోమీటరుకు సుమారు 25 పైసలు అని సంస్థ పేర్కొన్నారు.

మ్యాటర్​ కంపెనీ సంవత్సరానికి 60,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. డిమాండ్ ఆధారంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని 120,000 యూనిట్లకు మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. 2025 నాటికి రెండో తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలని మ్యాటర్​ సంస్థ భావిస్తోంది.

అహ్మదాబాద్​లో మ్యాటర్​ ఎక్స్​పీరియెన్స్​ హబ్​ని సంస్థ ఇటీవలే ప్రారంభించింది. ఈ సందర్భంగా మ్యాటర్ గ్రూప్ ఫౌండర్, సీఈఓ మొహల్ లాల్ భాయ్ మాట్లాడుతూ.. “మ్యాటర్ ఎక్స్​పీరియన్స్ హబ్​ను ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఇది మొబిలిటీ భవిష్యత్తును పునర్నిర్వచించడంలో మా నిబద్ధతకు చిహ్నం. అహ్మదాబాద్​లో మా ఫ్లాగ్​షిప్ రిటైల్ స్పేస్​ను తెరవడం అనేది కస్టమర్లతో మా సంబంధాలను మెరుగుపరచడంలో కీలకమైన దశ. ఎరా ఎలక్ట్రిక్​ బైక్​ని ప్రవేశపెట్టడం ద్వారా అద్భుతమైన ఆవిష్కరణను అందించడమే కాకుండా మోటార్ బైక్ రంగంలో కస్టమర్ ఎక్స్​పీరియన్స్​ని పెంచుతున్నాం. వర్తమానం, భవిష్యత్తు రెండింటినీ రూపొందించే ఈ ఉత్తేజకరమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు, మా ప్రారంభ ఎక్స్​పీరియన్స్ హబ్ నుంచి ఎరా డెలివరీలను ప్రారంభించడం మాకు గర్వంగా ఉంది. మా నిరంతర కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీని ముందుకు తీసుకెళ్లడానికి మా అంకితభావం స్థిరంగా ఉంది,” అని అన్నారు.

తదుపరి వ్యాసం