Electric Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉంటే మీ కోసం 5 బెస్ట్ ఆప్షన్స్-5 best electric scooters to purchase in middle class range ola s1 x to joy e bike ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉంటే మీ కోసం 5 బెస్ట్ ఆప్షన్స్

Electric Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉంటే మీ కోసం 5 బెస్ట్ ఆప్షన్స్

Anand Sai HT Telugu
Oct 20, 2024 07:00 PM IST

Electric Scooters : ఇటీవలి కాలంలో ఈవీల వాడకం పెరిగింది. చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకుంటున్నారు. అయితే ఈ దీపావళికి మీ ఇంటికి ఎలక్ట్రిక్ స్కూటీ తెచ్చుకోవాలనుకుంటే మీ కోసం బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో చూసేండి..

ఓలా ఎస్1 ఎక్స్
ఓలా ఎస్1 ఎక్స్

దీపావళి పండుగ దగ్గరకు వస్తుంది. దీపావళి అనగానే క్రాకర్స్, రుచికరమైన స్వీట్లు మాత్రమే కాదు.. చాలా మంది కొత్త వాహనాలను ఇంటికి తెచ్చుకుంటారు. మార్కెట్‌లో ఏది కొనాలా అని ఆలోచిస్తారు. ప్రతి సంవత్సరం దీపావళికి కంపెనీలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తాయి. దీపావళి సీజన్‌లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలని మీరు అనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కంపెనీలు కూడా వినియోగదారులను పెంచుకునేందుకు కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. అంతేకాదు.. వాటిపై తగ్గింపును కూడా ఇస్తున్నాయి. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకుంటే 5 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

ఓలా ఎస్1 ఎక్స్

ఓలా ఎస్1 అనేది 2kWh బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటి. ఇది పూర్తి ఛార్జింగ్‌తో గరిష్టంగా 151 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ చెప్పింది. స్కూటర్ టాప్-స్పీడ్ 90కేఎంపీహెచ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 7 విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ఆంపియర్ మాగ్నస్ ఎక్స్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి బ్యాటరీని విడిగా తొలగించవచ్చు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 80 నుండి 100 కి.మీ. దీని ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ.85 వేలుగా ఉంది.

లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ జీ3.0

రోజువారీ ప్రయాణానికి అనువైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఇ-స్కూటర్‌కు సంబంధించిన బ్యాటరీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అందుబాటులో ఉంది. బ్యాటరీ కోసం నెలవారీ ఒప్పందం రూ.999. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి బ్యాటరీ ఛార్జ్‌తో గరిష్టంగా 115 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 18 ఎఎంపీ ఛార్జర్‌తో కేవలం 3 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ జీ2.0

ఇది ఒక ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్. ఎందుకంటే ఈ స్కూటర్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. మీ మొబైల్ ఫోన్‌ను స్కూటర్‌కి కనెక్ట్ చేసేందుకు కూడా వీలుగా ఉంటుంది. ఇది 2.3 KW బ్యాటరీతో వస్తుంది. పూర్తి ఛార్జింగ్‌తో 98 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

జాయ్​ ఈ బైక్

జాయ్​ ఈ బైక్​ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ .1.17 లక్షలు. గ్లోబ్, జెన్ నెక్ట్స్ నాను, వోల్ఫ్, వోల్ఫ్ ఎకో, వోల్ఫ్ ప్లస్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని కూడా ఈ బ్రాండ్ విక్రయిస్తోంది. వీటి ధరలు రూ .70,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్​ దాదాపు 130 కి.మీ రేంజ్​. రెట్రో లుక్స్​తో ఇది వస్తుంది.

Whats_app_banner