Cello World IPO : సెల్లో వరల్డ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ షురూ.. అప్లై చేయాలా? జీఎంపీ ఎంత?
30 October 2023, 18:18 IST
- Cello World IPO : సెల్లో వరల్డ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓ జీఎంపీతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సెల్లో వరల్డ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ షురూ.. అప్లై చేయాలా? జీఎంపీ ఎంత?
Cello World IPO : సెల్లో వరల్డ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ సోమవారం ఓపెన్ అయ్యింది. ఈ ఐపీఓ.. మొదటి రోజు 31శాతం సబ్స్క్రైబ్ అయ్యిందని డేటా సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
సెల్లో వరల్డ్ ఐపీఓ..
సోమవారం ఓపెన్ అయిన ఈ సెల్లో వరల్డ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్.. బుధవారం, అంటే నవంబర్ 1న ముగుస్తుంది. ఐపీఓ ప్రైజ్ బ్యాండ్ షేరుకు రూ. 617- రూ. 648. ఐపీఓ కచ్చితంగా అలాట్ అవ్వాలని అనుకుంటే.. రూ.648 అయిన అప్పర్ బ్యాండ్ ప్రైజ్ని కోట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ ఫేస్ వాల్యూ రూ. 5
Cello World IPO subscription status : ఈ ఐపీఓ వాల్యూ రూ. 1,900 కోట్లు. ఇందులో 50శాతం షేర్లను క్యూఐబీ (క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్)లకు కేటాయించింది సంస్థ. ఎన్ఐఐ (నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) వాటా 15శాతంగా ఉంది. ఇక రీటైర్లకు 35శాతం వాటా కేటాయించారు. ఎంప్లాయీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. వీరు ప్రైజ్ బ్యాండ్ కన్నా రూ. 61 (షేరుకు) తక్కువగానే ఐపీఓను అప్లై చేసుకోవచ్చు.
తొలి రోజులో భాగంగా.. సెల్లో వరల్డ్ ఐపీఓను రీటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 32శాతం మంది, ఎన్ఐఐ కేటగిరీలో 72శాతం మంది, క్యూఐబీ కేటగిరీలో 2శాతం మంది, ఎంప్లాయీ కేటగిరీలో 40శాతం మంది అప్లై చేసుకున్నారు.
గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత..?
Cello World IPO GMP : సెల్లో వరల్డ్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం 135గా ఉంది. అంటే.. స్టాక్ మార్కెట్లో ఈ ఐపీఓ.. రూ. 783 వద్ద లిస్ట్ అవుతుందని సెకెండరీ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి (648+135). అయితే.. ఒక ఐపీఓల కోసం వాటి జీఎంపీని చూడటం మంచిదే కానీ, కేవలం అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అప్లై చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
సెల్లో వరల్డ్ సంస్థ భారతీయులకు సుపరిచితమే. స్టేషనరీ, రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మౌల్డెడ్ ఫర్నీచర్, కన్జ్యూమర్ హౌజ్వర్ వంటి రంగాల్లో ఈ సంస్థ వ్యాపారాలు చేస్తుంది. ముఖ్యంగా.. సెల్లో వరల్డ్ పెన్స్ చాలా ఫేమస్.