Dhoni Trading : ధోనీలో కొత్త యాంగిల్.. స్టాక్ మార్కెట్ ట్రేడర్ కూడా!
MS Dhoni Stock market Trading : టీమిండియా మాజీ సారథి ధోనీకి స్టాక్ మార్కెట్‌పైనా అవగాహన ఉంది! ట్రేడింగ్ గురించి ధోనీ మాట్లాడిన మాటలు.. ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Dhoni Stock market Trading : క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ సృష్టించిన రికార్డుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. వ్యాపారం రంగంలో ధోనీ కార్యకలాపాలు కూడా తరచూ వార్తల్లో నిలుస్తాయి. ఇక ఇండియా మాజీ సారథి.. స్వయంగా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది.
స్టాక్ మార్కెట్ గురించి ధోనీ న్న మాటలు..
బెంగళూరు వేదికగా ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎం.ఎస్ ధోనీ. అనేక మంది స్టాక్ మార్కెట్ నిపుణులు సైతం ఆ ఈవెంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడి, తనలోని మరో కోణాన్ని బయటకు తీసుకొచ్చారు ఈ టీమిండియా మాజీ కెప్టెన్.
Dhoni on stock markets : "గత రెండు రోజులుగా నా పోర్ట్‌ఫోలియో 8శాతం పడిపోయిందని, వీరందరు సంతోషంగా ఉన్నారు. 19,300 దగ్గర బలమైన సపోర్ట్ ఉందని, కచ్చితంగా మార్కెట్ పైకి వెళుతుందని వీరు (స్టాక్ మార్కెట్ నిపుణులు) చెబుతారు. కానీ ఆ మరుసటి రోజే.. నిఫ్టీ 18,800కి పడిపోయింది," అని ధోనీ అన్న మాటలు ఆ వీడియోలో రికార్డు అయ్యాయి. ధోనీ అన్న మాటలతో ఈవెంట్లో ఉన్న వారందరు నవ్వుకున్నారు.
ఆ తర్వాత.. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి కూడా ధోనీ మాట్లాడినట్టు తెలుస్తోంది.
ఈ వీడియోకు ఇప్పటికే 77వేల వ్యూస్ వచ్చాయి. 600కుపైగా లైక్స్ లభించాయి.
Dhoni Viral video : ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం, బాండ్ మార్కెట్, ద్రవ్యోల్బణం కారణాలతో గత కొన్ని రోజులుగా.. దేశీయ సూచీలు దారుణంగా పతనమవుతున్నాయి. శుక్రవారం వచ్చిన రిలీఫ్ ర్యాలీకి ముందు.. నిఫ్టీ 18,800 మార్క్‌ని టచ్ చేసింది.
ఈ విషయాలను ధోనీ ట్రాక్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
MS Dhoni latest news : "మన ధోనీ మంచి ట్రేడర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి! క్రికెట్ అయినా, ట్రేడింగ్ అయినా.. కూల్‌గా, టెన్షన్ పడకుండా ఉండాలి," అని నెటిజన్ కామెంట్ చేశారు. "వావ్! ఆప్షన్స్‌పై ధోనీకి ఉన్న జ్ఞానం నన్ను ఆశ్చర్యపరిచింది," అని మరో వ్యక్తి రాసుకొచ్చారు.