తెలుగు న్యూస్  /  బిజినెస్  /  బడ్జెట్ 2024: రేపటి కేంద్ర బడ్జెట్ నుంచి రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఏం ఆశిస్తోంది

బడ్జెట్ 2024: రేపటి కేంద్ర బడ్జెట్ నుంచి రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఏం ఆశిస్తోంది

HT Telugu Desk HT Telugu

31 January 2024, 14:31 IST

google News
    • Budget 2024: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ నుంచి రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఏం ఆశిస్తోంది? సత్వ గ్రూప్ ఎండీ బిజయ్ అగర్వాల్ ఏమంటున్నారో తెలుసుకోండి.
బిజయ్ అగర్వాల్
బిజయ్ అగర్వాల్

బిజయ్ అగర్వాల్

అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం ప్రోత్సహించేందుకు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి చొరవ చూపుతారని ఆశిస్తున్నట్టు సత్వ గ్రూప్ ఎండీ బిజయ్ అగర్వాల్ హిందుస్తాన్ టైమ్స్‌తో చెప్పారు.

యూనియన్ బడ్జెట్ 2024 కోసం మా అంచనాలు దీర్ఘకాలిక వృద్ధికి కీలకమైన స్తంభాలపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఆస్తి విలువలు, డిమాండ్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని గుర్తించి, పెరిగిన కేటాయింపుల ఫలితంగా మౌలిక సదుపాయాలకు ఊతమివ్వడాన్ని మేం ఆశిస్తున్నాం. జీఎస్టీ రేట్ల తగ్గింపు, డిమాండ్, పెట్టుబడిని పెంచడానికి భారీ తగ్గింపులతో కూడిన పన్ను సంస్కరణలు అత్యంత ప్రాధాన్యతనిస్తాయి. అనేక రకాల గృహ అవసరాలను తీర్చడం కోసం 'అఫర్డబుల్ హౌసింగ్ ఇన్సెంటివ్స్' పట్ల దృఢ నిబద్ధత కీలకం.

అలాగే 'సింగిల్-విండో క్లియరెన్స్' అవరోధాలను తగ్గించడం ద్వారా ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయడాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. పరిశ్రమ ఆర్థిక సవాళ్లు అనేవి 'లిక్విడిటీ సపోర్ట్' కోసం అంచనాలు, నిధులను సులభంగా పొందేందుకు తీసుకునే చర్యలకు అనుగుణంగా ఉంటాయి.

మేం సుస్థిరత ధోరణులకు అనుగుణంగా 'గ్రీన్ ఇనిషియేటివ్స్'ని అంచనా వేస్తున్నందున పర్యా వరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించే ప్రోత్సాహకాల కోసం చూస్తున్నాం. ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, పారదర్శకతను పెంచడానికి 'డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్' అవసరం. నియంత్రణ యంత్రాంగాలను మెరుగు పరచడానికి 'రెరా సవరణలు' ఊహిస్తున్నాం. ఆశావాదంతో, మేం ఈ రంగాన్ని సుస్థిరమైన వృద్ధి, ఆర్థిక శక్తి, సామాజిక పురోగతి వైపు నడిపించే సహకార ప్రయత్నాల కోసం ఎదురుచూస్తున్నాం.

2024-2025 ఆర్థిక సంవత్సరానికి రాబోయే యూనియన్ బడ్జెట్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన కీలకమైన అవసరాలను పరిష్కరించడంలో చురుకైన విధానం అనుసరిస్తున్నందుకు గాను ఆర్థిక మంత్రిని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (NAREDCO) ప్రశంసించడాన్ని కూడా మేం స్వాగతిస్తున్నాం.

గణనీయమైన రూ. 50,000 కోట్ల కార్పస్‌తో సరసమైన, మధ్యస్థ ఆదాయ గృహాల (SWAMIH) నిధి కోసం ప్రత్యేక విండో యొక్క రెండో విడతను రూపొందించాలని NAREDCO ప్రతిపాదించింది. వినియోగదారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి గణనీ యమైన ప్రయోజనాలను అందించేలా, దేశవ్యాప్తంగా నిలిచిపోయిన గృహనిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పరిశ్రమ చేస్తున్న ఒత్తిడికి ఈ వ్యూహాత్మక చర్య అనుగుణంగా ఉంటుంది..’ అని బిజయ్ అగర్వాల్ వివరించారు.

తదుపరి వ్యాసం