Budget Impact On Stock Market : బడ్జెట్ 2024తో ఏ రంగాల్లోని ఏ స్టాక్స్ లాభపడతాయి?
17 July 2024, 12:27 IST
- Budget 2024 : బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు దగ్గరకొస్తుంది. అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో కొన్ని రంగాల్లో స్టాక్స్ లాభపడతాయి. ఏ స్టాక్స్ లాభాల్లోకి వెళ్తాయో అంచనా చూద్దాం.. (గమనిక : ఇది అంచనా మాత్రమే, కొనుగోలు సూచన కాదు.)
స్టాక్స్ మార్కెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను జూలై 23, మంగళవారం నాడు సమర్పించనున్నారు. బడ్జెట్ సహజంగానే స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో కొన్ని స్టాక్స్ లాభాల్లోకి దూసుకెళ్తాయి. దీనికి కారణం ఆయా రంగాల్లో బడ్జెట్ కేటాయింపులే కారణం. అయితే బడ్జెట్ కేటాయింపులతో ఏ రంగంలోని ఏ స్టాక్స్ లాభపడతాయో అంచనా చూద్దాం..
2025 ఆర్థిక సంవత్సరానికి ఎరువుల సబ్సిడీ రూ.1.64 లక్షల కోట్లు సరిపోతుందని అంచనా. గణనీయమైన బడ్జెట్ కేటాయింపులు సాంకేతికత స్వీకరణను వేగవంతం చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి, ఈ ప్రాంతంలో నిల్వ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. దీనితో కొన్ని స్టాక్స్ లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
కోరమాండల్ ఇంటర్నేషనల్, చంబల్ ఫెర్టిలైజర్స్, మద్రాస్ ఫెర్టిలైజర్స్, ఇన్‌సెక్టిసైడ్స్ ఇండియా, సుమిటోమో కెమికల్, ధనుకా అగ్రిటెక్, పీఐ ఇండస్ట్రీస్, హిమాద్రి స్పెషాలిటీ, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, నియోజెన్ కెమికల్స్ వంటి స్టాక్‌లు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
వచ్చే ఐదేళ్లలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ముప్పై మిలియన్ల ఇళ్లను నిర్మించాలని జూన్ 10న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 20 మిలియన్ల గ్రామీణ గృహాలను నిర్మించడానికి PMAY పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రకటన వల్ల అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, దాల్మియా భారత్ వంటి షేర్లు లాభపడే అవకాశం ఉంది.
ఆటో, వ్యవసాయ రంగ ఉపకరణాలు, ఎంట్రీ లెవల్ ఫోర్ వీలర్ పరికరాల తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఇది మహీంద్రా, హీరో మోటోకార్ప్ వంటి స్టాక్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఆటో మెుబైల్స్ స్టాక్స్‌కు లాభం చేకూరే అవకాశం ఉంది.
రక్షణ, రైల్వేలకు సహజంగానే కేటాయింపులు బడ్జెట్‌లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌కు అనుకూలంగా ఉంటాయి. అయితే రైల్వే మౌలిక సదుపాయాలపై అధిక క్యాపెక్స్ RVNL, టిటాగర్ రైల్ సిస్టమ్స్ వంటి రైల్వే స్టాక్‌లను ప్రోత్సహిస్తుంది.
తక్కువ ఆదాయ ప్రజలకు దేశీయ PNG కోసం సబ్సిడీ, CNG పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో IGL, MGL, గుజరాత్ గ్యాస్, గెయిల్‌లకు అనుకూలంగా ఉంటుంది.
FMCG(Fast-moving consumer goods) పన్ను తగ్గింపులు, పన్ను శ్లాబ్‌లో విస్తరణలు లేదా సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసే పెట్టుబడుల పరిమితిని పెంచితే కొన్నింటికి లాభం వస్తుంది. ఇది డాబర్, హెచ్‌యుఎల్, గోద్రెజ్ కన్స్యూమర్, నెస్లేతోపాటుగా మరికొన్ని ఎఫ్‌ఎంసీజి స్టాక్‌లను పెంచుతుంది.
గమనిక : ఇది కేవలం అంచనాలు మాత్రమే. కొనుగోలు సూచన కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. కచ్చితంగా నిపుణుల సలహా తీసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి.