తెలుగు న్యూస్  /  బిజినెస్  /  బడ్జెట్ 2024: 40 వేల రైలు బోగీలు వందే భారత్ బోగీల స్థాయికి

బడ్జెట్ 2024: 40 వేల రైలు బోగీలు వందే భారత్ బోగీల స్థాయికి

HT Telugu Desk HT Telugu

01 February 2024, 12:05 IST

google News
  • బడ్జెట్ 2024: 40,000 రైలు బోగీలను వందే భారత్ బోగీల తరహాలో అప్‌గ్రేడ్ చేస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (PTI)

బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ప్రయాణికుల సౌలభ్యం కోసం 40,000 రైల్వే బోగీలను వందే భారత్ ప్రమాణాలకు మారుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మౌలిక సదుపాయాల కేటాయింపును రూ.11.11 లక్షల కోట్లకు పెంచినట్లు తెలిపారు.

మూడు ప్రధాన రైల్వే ఎకనామిక్ కారిడార్ల అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

వీటిలో ఒకటి ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్లు. రెండోది పోర్టు కనెక్టివిటీ కారిడార్లు. మూడోది అధిక ట్రాఫిక్ సాంద్రత కారిడార్లు. మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం పీఎం గతి శక్తి కింద ఈ ప్రాజెక్టులను గుర్తించారు. ఇవి లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఖర్చును తగ్గిస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఆశావహ జిల్లాలు, బ్లాకుల వేగవంతమైన అభివృద్ధి కోసం రాష్ట్రాలకు సహాయం చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తూర్పు ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను భారత వృద్ధికి శక్తివంతమైన చోదకశక్తిగా మార్చేందుకు ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు.

తదుపరి వ్యాసం