BMW XM launch : వావ్.. ఓకే రోజు 3 కార్లను లాంచ్ చేయనున్న బీఎండబ్ల్యూ- ఎప్పుడంటే!
22 November 2022, 13:59 IST
- BMW XM launch in India : లగ్జరీ వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ఇండియాలో ఒకేసారి 3 కార్లను లాంచ్ చేయనుంది. ఆ వివరాలు..
వావ్.. ఓకే రోజు 3 కార్లను లాంచ్ చేయనున్న బీఎండబ్ల్యూ
BMW XM launch in India : బీఎండబ్ల్యూ ప్రేమీకులకు అదిరిపోయే వార్త! ఈ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ.. ఇండియాలో ఒకే రోజు మూడు కార్లను లాంచ్ చేయనుంది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం, బీఎండబ్ల్యూ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్7, బీఎండబ్ల్యూ ఎం 340ఐలు.. డిసెంబర్ 10న లాంచ్ అవ్వనున్నాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్ఎం..
బీఎండబ్ల్యూ ఎం నుంచి వస్తున్న రెండో 'బీస్పోక్' మోడల్.. ఈ ఎక్స్ఎం. బీస్పోక్ మోడల్ అంటే.. ప్రత్యేకంగా కొద్ది మంది కస్టమర్ల కోసమే రూపొందించే వాహనం అని అర్థం. ఇందులో ప్లగ్ ఇన్ హైబ్రీడ్ సిస్టెమ్ ఉంటుంది. 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ ఇంజిన్‌తో ఈ ప్లగ్ ఇన్ హైబ్రీడ్ సిస్టెమ్ కలిపి వస్తుంది. ఫలితంగా ఈ ఎస్యూవీ.. 644బీహెచ్పీ పవర్, 800ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
BMW XM price : ఇందులో 25.7కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆల్ ఎలక్ట్రిక్ డ్రైవింగ్ మోడ్‌లో.. ఈ వాహనం 88కి.మీలు ప్రయాణించగలదు. 0-100 కేఎంపీహెచ్‌ను 4.3సెకన్లలో చేరుకోగలుగుతుంది ఈ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం. దీని టాప్‌స్పీడ్ 250కేఎంపీహెచ్.
బీఎండబ్ల్యూ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్7..
BMW X7 facelift model launch : ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎక్స్7కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను తీసుకొస్తోంది బీఎండబ్ల్యూ. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. డిజైన్‌లో స్వల్పంగా మార్పులు జరిగాయి. క్యాబిన్ ఇంటీరియర్‌లో కూడా పలు మార్పులు చేశారు. 14.9ఇంచ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, 12.3ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అదనంగా ఇచ్చారు. డాష్‌బోర్డు డిజైన్ పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది.
6సిలిండర్ పెట్రోల్, డీజిల్, హబ్రీడ్ ఇంజిన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు బీఎండబ్ల్యూ అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తాయి.
బీఎండబ్ల్యూ ఎం 340ఐలు..
BMW M 340i : ఇండియాలో ఒక బీఎండబ్ల్యూ మోడల్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ లభిస్తుండటం ఇది తొలిసారి. అదే ఎం 340ఐ. అంతర్జాతీయ మార్కెట్లో ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. ఒరిజినల్‌తో పోల్చుకుంటే దీని స్టైలింగ్, టెక్నాలజీ మరింత పెరిగింది. ఇందులో 12.3ఇంచ్ డిజిటల్ గాజ్ క్లస్టర్, 14.9ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంటాయి.