తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bmw Ce 04 : ఇండియాలో బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

BMW CE 04 : ఇండియాలో బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

Sharath Chitturi HT Telugu

23 June 2024, 11:50 IST

google News
    • BMW CE 04 price : ఇండియాలో బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. లాంచ్​ డేట్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..
బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

BMW CE 04 price in India : బీఎండబ్ల్యూ మోటోరాడ్.. తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్​ను భారత మార్కెట్​లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. సీఈ 04గా పిలిచే ఈ ఈ-స్కూటర్​ సేల్ జూలై 24న ప్రారంభంకానుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్​లో 11,795 డాలర్ల ధరకు అమ్మకానికి ఉంది. ప్రీమియం తయారీదారు నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో భారత మార్కెట్​లో ఈ బీఎండబ్ల్యూ సీఈ 04కు ప్రత్యక్ష పోటీదారులు ఎవరూ లేరు.

రైడింగ్ రేంజ్ అనేది బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి సాధారణంగా అడిగే ప్రశ్న! డబ్ల్యూఎంటీసీ సైకిల్ ప్రకారం.. బీఎండబ్ల్యూ సీఈ 04ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 129 కిలోమీటర్లు లేదా 80 మైళ్ల రైంజ్​ని కలిగి ఉంది. బ్యాటరీ ప్యాక@ను 0-100 శాతం ఛార్జింగ్ చేయడానికి సుమారు 4 గంటల 20 నిమిషాలు పడుతుంది. 0-80 శాతం ఛార్జింగ్ కు 3 గంటల 30 నిమిషాలు పడుతుంది. మీరు ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే, 0-100 శాతం ఛార్జ్ చేయడానికి 1 గంట 40 నిమిషాలు, 0-80 శాతం ఛార్జ్ చేయడానికి 1 గంట 5 నిమిషాలు పడుతుంది.

ఇదీ చూడండి:- Hyundai Kona Electric : కోనా ఎలక్ట్రిక్​ని సైలెంట్​గా డిస్కంటిన్యూ చేసిన హ్యుందాయ్​..!

బీఎండబ్ల్యూ సీఈ 04: స్పెసిఫికేషన్స్​..

BMW CE 04 launch date in India : బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​కు లిక్విడ్-కూల్డ్ పర్మనెంట్-మాగ్నెట్ సింక్రోనస్ మోటార్​ను అమర్చింది. ఈ ఇంజిన్.. 19.72 బీహెచ్​పీ పవర్ రేటింగ్​ను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 4,900 ఆర్​పీఎమ్ వద్ద 41.4 బీహెచ్​పీ పవర్- 1,500 ఆర్​పీఎమ్ వద్ద 61 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

ఈ బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్.. గంటకు 120 కిలోమీటర్లు, ఈ ఈ-స్కూటర్​ కేవలం 2.6 సెకన్లలో 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ ఎకో, రెయిన్, రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్లను కూడా అందిస్తుంది.

బీఎండబ్ల్యూ సీఈ 04: ఫీచర్లు..

BMW CE 04 range : బీఎండబ్ల్యూ సీఈ 04 ఈ స్కూటర్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్, బీఎండబ్ల్యూ మోటోరాడ్ కనెక్టివిటీతో కూడిన 10.25 ఇంచ్​ టిఎఫ్​టీ డిస్​ప్లే, కీలెస్ రైడ్, ఏబీఎస్, ఏఎస్​సీ, ఎలక్ట్రానిక్ రివర్స్, యూఎస్​బీ- సీతో వెంటిలేటెడ్ స్టోరేజ్ కంపార్ట్​మెంట్​తో వస్తుంది. అదనంగా, కొనుగోలు చేయడానికి కొన్ని ఆప్షనల్ ఫీచర్లు, యాక్ససరీలు అందుబాటులో ఉన్నాయి.

మరి ఇండియాలో ఈ స్కూటర్​ ధర ఎంత ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. ధరతో పాటు ఇతర వివరాలపై లాంచ్​ టైమ్​కి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇంకో విషయం.. హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్​ ఇండస్ట్రీ నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి..!

తదుపరి వ్యాసం