Hyundai Kona Electric : కోనా ఎలక్ట్రిక్‌ని సైలెంట్‌గా డిస్కంటిన్యూ చేసిన హ్యుందాయ్..!
Hyundai Kona Electric discontinued : 450 కి.మీ రేంజ్ ఇచ్చే కోనా ఎలక్ట్రిక్‌ని డిస్కంటిన్యూ చేసింది హ్యుందాయ్ సంస్థ. ఇందుకు ఓ కారణం ఉంది. అదేంటంటే..
Hyundai Kona Electric latest news : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్.. కోనా ఎలక్ట్రిక్‌ని ఇండియాలో డిస్కంటిన్యూ చేసింది! తన వెబ్సైట్ నుంచి కోనా ఎలక్ట్రిక్‌ను సైలెంట్‌గా తొలగించింది. క్రెటా ఈవీని విడుదల చేయడానికి.. సంస్థ శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో.. కోనా ఎలక్ట్రిక్ డిస్కంటిన్యూ అవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. క్రేటా ఈవీ లాంచ్ అవుతోంది కాబట్టి.. ఇక కోనా ఎలక్ట్రిక్‌ని నిలిపివేయాలని సంస్థ భావించినట్టు తెలుస్తోంది.
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీ సెగ్మెంట్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే.. ఇండియాలో సంస్థ తొలి ఈవీ.. కోనా ఎలక్ట్రిక్‌ని మాత్రం హ్యుందాయ్ ఎప్పుడూ అప్డేట్ చేయలేదు. పాత ఇంటీరియర్ డిజైన్, అందరూ ఎస్‌యూవీలకే మొగ్గుచూపుతున్న ఈ రోజుల్లో కోనా ఎలక్ట్రిక్ ఒక క్రాసోవర్ కావడంతో అమ్మకాలు సరిగ్గా లేవు. అందుకే.. కోనా ఎలక్ట్రిక్‌ని సంస్థ డిస్కంటిన్యూ చేసినట్టు తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉన్న భారత్‌లో.. ఈవీని లాంచ్ చేస్తున్నవార్తలు ఎక్కువగా వినిపిస్తాయి. కానీ ఇలా.. ఈవీని డిస్కంటిన్యూ చేస్తున్న వార్తలు చాలా అరుదు. మరి హ్యుందాయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.
హ్యుందాయ్ క్రెటా ఈవీ..
Hyundai Creta EV launch date in India : హ్యుందాయ్ తమ మొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాన్ని జనవరి 2025లో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఇది.. బెస్ట్ సెల్లింగ్ క్రేటాకి ఈవీ వర్షెన్ అని, చెన్నై సమీపంలోని ఫ్యాక్టరీలో తయారవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
క్రెటా ఐసీఈ వర్షెన్ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీల్లో ఒకటి. అందుకే.. ఈ క్రేటాలో ఈవీ వర్షెన్‌ని లాంచ్ చేస్తే.. డిమాండ్‌ని క్యాచ్ చేయవచ్చని సంస్థ భావిస్తోంది. ఇది మంచి స్ట్రాటజీ అవుతుంది.
ప్రస్తుతం క్రెటా ఈవీ స్పెసిఫికేషన్లకు సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇది సుమారు 400-500 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మారుతీ సుజుకీ నుంచి రాబొయే తొలి ఈవీ.. ఈవీఎక్స్కి కూడా ఇదే రేంజ్ ఉండనుంది.
Hyundai Creta EV price : క్రెటా ఈవీ, ఈవీఎక్స్ మధ్య ఒక ప్రధాన వ్యత్యాసం.. అవి తయారయ్యే ప్లాట్‌ఫామ్ కావచ్చు. ఈవీఎక్స్.. ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించే వాహనాలకు కేబిన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం, క్రెటా ఈవీ కొత్త ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుందా? లేదా.. ప్రస్తుతం ఉన్న క్రేటా ఐసీఈ మోడల్‌నే మారుస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతానికి, ఈ క్రేటా ఈవీ ఎస్యూవీ ధరపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. కానీ క్రెటా ఈవీ ధర రూ .20 లక్షల నుంచి రూ .30 లక్షల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ క్రెటా ఈవీ.. ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్, మారుతీ సుజుకీ ఈవీఎక్స్, బీవైడీఏ 3, మహీంద్రా ఎక్స్‌యూవీ400లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
సంబంధిత కథనం