Electric scooter : సింగిల్ ఛార్జ్‌తో 211 కి.మీ రేంజ్- ఈ రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యామిలీ కోసమే!
14 December 2024, 6:59 IST
- Family Electric scooter : ఫ్యామిలీ ఓరియెంటెడ్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే మీరు రెట్రో థీమ్‌తో వచ్చే ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఈ-స్కూటర్ గురించి తెలుసుకోవాల్సిందే! ఈ వెహికిల్ రేంజ్, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్..
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనేందుకు ప్రజలు ఆసక్తిగా కనిపిస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే! రెట్రో థీమ్‌తో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్, రేంజ్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
ఇదే ది బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్..!
ప్యూర్ ఈవీ అనే సంస్థ ఈ ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 1,14,999. ఈ రెట్రో థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి మంచి డిమాండ్ కనిపిస్తోంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 211 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. అలాగే, హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్హిల్అసిస్ట్, కోస్టింగ్ రెజెన్, రివర్స్ మోడ్, బ్యాటరీ లాంగ్ లైఫ్ కోసం స్మార్ట్ ఏఐ వంటి అధునాతన ఫీచర్లు ఈ ఈవీలో ఉన్నాయి. రెట్రో థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ అనే నాలుగు విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.5 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 3.21 బిహెచ్పీ పీక్ పవర్‌ని జనరేట్ చేయగల ఎలక్ట్రిక్ మోటారుతో కనెక్ట్ చేసి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో ఏఐఎస్-156 సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్ దీని సొంతం. ఈ స్కూటర్ మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. ఈ స్కూటర్ 60,000 కిలోమీటర్ల స్టాండర్డ్ బ్యాటరీ వారంటీతో వస్తుందని, 70,000 కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉందని ప్యూర్ ఈవీ తెలిపింది.
ఈప్లూటో 7జీ మ్యాక్స్ డిజైన్ గురించి మాట్లాడితే..ఈ స్కూటర్ ఎల్ఈడీ లైట్లు, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక అంశాలతో కూడిన ఓల్డ్-స్కూల్ డిజైన్ని కలిగి ఉంది. ఈ స్కూటర్ స్మార్ట్ రీజెనరేటివ్ టెక్నాలజీని కలిగి ఉందని తయారీదారు పేర్కొన్నారు. రైడర్ సౌలభ్యాన్ని పెంచే రివర్స్ మోడ్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆటో పుష్ ఫంక్షన్‌తో, ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు ఐదు కిలోమీటర్ల స్థిరమైన వేగంతో ముందుకు కదులుతుంది. అంటే రైడర్ దానిని మాన్యువల్‌గా నెట్టాల్సిన అవసరం లేదు.
ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ వడేరా మాట్లాడుతూ.. రోజుకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని 7జీ మోడల్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను రూపొందించినట్లు తెలిపారు. అంటే ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ని నగర ప్రయాణాలకు ఎక్కువగా వాడుకోవచ్చు.