తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget Smartphones : 20వేలకు మించి బడ్జెట్​ లేదా? ఏం పర్లేదు గురూ- ఈ​ స్మార్ట్​ఫోన్స్​ బెస్ట్​!

Budget smartphones : 20వేలకు మించి బడ్జెట్​ లేదా? ఏం పర్లేదు గురూ- ఈ​ స్మార్ట్​ఫోన్స్​ బెస్ట్​!

Sharath Chitturi HT Telugu

03 December 2024, 12:44 IST

google News
  • Budget smartphones under 20000: రూ. 20వేల బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! బడ్జెట్​ రేంజ్​లో ఈ డిసెంబర్​ 2024లో టాప్​ 4 స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

రూ. 20వేల బడ్జెట్​లో ఈ​ స్మార్ట్​ఫోన్స్​ బెస్ట్​!
రూ. 20వేల బడ్జెట్​లో ఈ​ స్మార్ట్​ఫోన్స్​ బెస్ట్​! (Aman Gupta / Mint)

రూ. 20వేల బడ్జెట్​లో ఈ​ స్మార్ట్​ఫోన్స్​ బెస్ట్​!

ఒక మంచి స్మార్ట్​ఫోన్​ కొనేందుకు మీ దగ్గర రూ. 20వేలకు మించి బడ్జెట్​లేదా? మరేం పర్లేదు! ఈ మధ్య కాలంలో బడ్జెట్​ ఫ్రెండ్లీ సెగ్మెంట్​లో కూడా అద్భుతమైన ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్స్​ వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్​ 2024లొ కొనేందుకు టాప్​ 4 స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

రూ.20,000 లోపు బెస్ట్ మొబైల్ స్మార్ట్​ఫోన్స్​..

ఐక్యూ జెడ్9:

ఐక్యూ జెడ్9 మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్​ను కలిగి ఉంది. ఇందులో 6.67 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వైబ్రెంట్ కలర్స్, ఫ్లూయిడ్ విజువల్స్ ఉన్నాయి. రేర్ కెమెరా సెటప్​లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ +, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​తో యాప్స్, మీడియాకు పుష్కలమైన స్పేస్​ని ఈ ఫోన్​లో పొందొచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​కి ఈ ఫోన్​ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 5జీ సిమ్ కార్డులకు సపోర్ట్ చేస్తుంది. అమెజాన్​లో దీని ధర రూ.19,998.

2. మోటో జీ85:

మోటో జీ85లో స్నాప్​డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్​ని అందించారు. ఇందులో 6.67 ఇంచ్​ పీ-ఓఎల్ఈడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వైబ్రెంట్, ఫ్లూయిడ్ విజువల్స్ ఉన్నాయి. రేర్ కెమెరా సిస్టమ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరాలో హై-రిజల్యూషన్ సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. డ్యూయల్ 5జీ సిమ్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే మోటో జీ85 ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.

3) వన్​ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్:

వన్​ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీలో 6.67 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్, 1,080×2,400 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 2,100 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 695 చిప్​సెట్, అడ్రినో 619 జీపీయూ, 8 జీబీ LPDDR4X ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఈ స్మార్ట్​ఫోన్​లో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి -600 ప్రైమరీ సెన్సార్​తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్​తో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) సపోర్ట్​తో 16 మెగాపిక్సెల్ సెన్సార్​ని కలిగి ఉంది.

నార్డ్ సీఈ 4 లైట్ 5జీ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ 80వాట్ వైర్డ్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ ఛార్జింగ్​కు సైతం సపోర్ట్ చేస్తుంది.

4. రియల్​మీ పీ1..

రియల్​మీ పీ1 స్మార్ట్​ఫోన్​లో 6.67 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ వంటివి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే రియల్ మీయూఐ 5.0 ఇందులో ఉంది

రియల్​మీ పీ1 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసితో పనిచేస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉన్నాయి. దీంతోపాటు మైక్రో ఎస్​డీ కార్డు ద్వారా ఈ డివైజ్ స్టోరేజ్​ని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

తదుపరి వ్యాసం