తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Under 1l Bikes : లక్ష రూపాయలలోపు ధరతో కొనుగోలు చేయాలనుకుంటే ఈ 125 సీసీ బైకులు బెస్ట్!

Under 1L Bikes : లక్ష రూపాయలలోపు ధరతో కొనుగోలు చేయాలనుకుంటే ఈ 125 సీసీ బైకులు బెస్ట్!

Anand Sai HT Telugu

17 December 2024, 18:00 IST

google News
    • Under 1L Bikes : మధ్యతరగతివారు తక్కువ సీసీలో బైకులు కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇది బడ్జెట్, మైలేజీ పరంగా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలా లక్ష రూపాయలలోపు బడ్జెట్‌తో ఉన్న 125 సీసీ బైకులు చూద్దాం..
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ చాలా పెద్దది. ప్రపంచంలో చాలా దేశాలకంటే ముందు ఉంది. చాలా విలువైన బైకుల నుంచి లక్షలోపు ధరలో ఉండే బైకులకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ. మధ్యతరగతివారు ఎక్కువగా బడ్జెట్ ధరలోని బైక్స్ గురించి చూస్తారు. దీనితోపాటుగా మైలేజీ గురించి ఆలోచిస్తారు. భారత్‌లో మార్కెట్‌లో లక్షల ఖరీదు చేసే క్లాస్ బైక్‌లతోపాటుగా రోజువారీ ఉపయోగానికి వాడే బైకులకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. మీరు 125సీసీ మోటార్‌సైకిల్‌ను రూ. 1 లక్షలోపు కొనుగోలు చేయాలనుకుంటే మీకోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.

హోండా ఎస్పీ 125

హోండా ప్రముఖ 125సీసీ బైక్ హోండా ఎస్పీ 125. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.87.5 వేలుగా ఉంది. కంపెనీ 123.94 లీటర్ ఇంజన్‌తో ఎస్పీ 125ని అందిస్తోంది. 10.72 బిహెచ్‌పీ పవర్, 10.9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

టీవీఎస్ రైడర్ 125

రూ. 1 లక్షలోపు అత్యుత్తమ 125సీసీ బైక్‌ల లిస్టులో రైడర్ 125ని ఉంది. టీవీఎస్ రైడర్ ఆరు రకాల వేరియంట్లలో దొరకుతుంది. ఎంట్రీ లెవెల్ రైడర్ వేరియంట్‌ను కస్టమర్లు కేవలం రూ.85 వేల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనికి ఐజీఓ అసిస్ట్ టెక్‌తో కూడిన 125సీసీ ఇంజన్ ఇచ్చారు. ఇది 11.2బీహెచ్‌పీ శక్తిని, 11.75ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్

మంచి డిజైన్‌తో బైక్ కొనుగోలు చేయాలనుకుంటే రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో ఈ బైక్ ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ మీకు బెటర్ ఆప్షన్. కంపెనీ దీనిని ఐబీఎస్ వేరియంట్‌తో కేవలం రూ.95 వేల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకే అమ్ముతోంది. ఇది 125సీసీ కెపాసిటీ గల ఇంజన్‌ని పొందుతుంది. 11.4 బిహెచ్‌పీ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

బజాజ్ పల్సర్ ఎన్125

బజాజ్ పల్సర్ లైనప్‌లో అనేక మోడల్స్ ఉన్నాయి. కస్టమర్లు తమ అవసరాన్ని బట్టి వీటిని సెలక్ట్ చేసుకోవచ్చు. తక్కువ ధర గురించి చూస్తే.. బజాజ్ పల్సర్ ఎన్125 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.92,704 వద్ద ఉంది. ఇది 11.8 బిహెచ్‌పీ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 125సీసీతో వస్తుంది.

తదుపరి వ్యాసం