తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fd Schemes: ఎక్కువ వడ్డీ రేటుతో కొత్త ఎఫ్ డీ స్కీమ్స్ ను ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

FD schemes: ఎక్కువ వడ్డీ రేటుతో కొత్త ఎఫ్ డీ స్కీమ్స్ ను ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

HT Telugu Desk HT Telugu

16 July 2024, 18:03 IST

google News
  • FD schemes: బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్వెస్టర్ల కోసం రెండు ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లను అందుబాటులో ఉంచింది. ఒకటి 7.15 శాతంతో 333 రోజుల కాలపరిమితి ఉన్న స్కీమ్ కాగా, మరొకటి 7.25 శాతం వడ్డీ శాతంతో 399 రోజుల కాలపరిమితితో ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా కొత్త ఎఫ్ డీ పథకాన్ని ప్రారంభించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ (Mint)

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్

FD schemes: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను ప్రారంభించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు పెట్టుబడిదారుల కోసం రెండు ప్రత్యేక డిపాజిట్ పథకాలను అందిస్తోంది. 333 రోజుల కాలపరిమితి కలిగిన మాన్సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్, ఇది సంవత్సరానికి 7.15 శాతం వడ్డీ రేటుని అందిస్తుంది. మరో పథకం 399 రోజుల మాన్సూ న్ ధమాకా డిపాజిట్ స్కీమ్. ఇది డిపాజిటర్లకు 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. తాజా ఎఫ్డీ వడ్డీ రేట్లు 2024 జూలై 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్ డీ స్కీమ్స్

అదనంగా, 360 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.10 శాతం వడ్డీని అందించే పథకాన్ని కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తోంది. సాధారణంగా, షార్ట్ టర్మ్ డిపాజిట్లు తక్కువ వడ్డీ రేటును అందిస్తాయి, అంటే 4.25 శాతం నుండి 6.85 శాతం (333 రోజులు మరియు 360 రోజులు మినహా) మధ్య వడ్డీని అందిస్తాయి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎఫ్ డీ స్కీమ్స్

అదేవిధంగా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వేర్వేరు కాలపరిమితికి నాలుగు ప్రత్యేక ఎఫ్ డీ (fixed deposit) పథకాలను అందిస్తుంది. అవి 200 రోజులు, 400 రోజులు, 666 రోజులు, 777 రోజుల కాల పరిమితితో కూడిన స్కీమ్స్. వీటిలో 200 రోజుల డిపాజిట్ కు 6.9 శాతం, 400 రోజుల డిపాజిట్ కు 7.10 శాతం, 666 రోజుల డిపాజిట్ కు 7.15 శాతం, 777 రోజుల డిపాజిట్ కు 7.25 శాతం వడ్డీ శాతం లభిస్తుంది. తాజా వడ్డీ రేట్లు 2024 జూలై 8 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రత్యేక కాలపరిమితి డిపాజిట్లపై మాత్రమే అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తుండటం గమనార్హం. చాలా ప్రత్యేక కాలపరిమితి పథకాలు 7 శాతం వరకు వడ్డీ రేటును కలిగి ఉండగా, ఇతర డిపాజిట్లు సంవత్సరానికి 7 శాతం కంటే తక్కువ వడ్డీని అందిస్తాయి.

ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ లు కూడా

ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను జూలై 2, 2024 నుండి సవరించింది. తాజా రేట్లు సాధారణ పౌరులకు 3 నుండి 7.20 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5 నుండి 7.75 శాతం మధ్య ఉన్నాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కూడా జూలై 1 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లు ఇప్పుడు సాధారణ పౌరులకు 3 నుండి 7.2 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుండి 7.75 శాతం మధ్య ఉన్నాయి.

తదుపరి వ్యాసం