EPFO interest rate: ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు పెంపునకు కేంద్రం అంగీకారం; ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ శాతం 8.15-epfo news govt approves 8 15 percent interest rate for pf deposits for 202223 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Epfo Interest Rate: ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు పెంపునకు కేంద్రం అంగీకారం; ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ శాతం 8.15

EPFO interest rate: ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు పెంపునకు కేంద్రం అంగీకారం; ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ శాతం 8.15

HT Telugu Desk HT Telugu
Jul 25, 2023 06:10 PM IST

EPFO interest rate: ఉద్యోగ భవిష్య నిథి డిపాజిట్లపై వడ్డీ శాతాన్ని పెంచాలన్న సిఫారసుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ లోని డిపాజిట్లకు 8.15% వార్షిక వడ్డీ లభిస్తుంది. త్వరలో ఈ వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలోకి ఈపీఎఫ్ఓ జమ చేయనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

EPFO interest rate: ఉద్యోగ భవిష్య నిథి డిపాజిట్లపై వడ్డీ శాతాన్ని పెంచాలన్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫారసుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇక ఈపీఎఫ్ఓ లోని డిపాజిట్లకు 8.15% వార్షిక వడ్డీ లభిస్తుంది. త్వరలో వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలోకి ఈపీఎఫ్ఓ జమ చేయనుంది. 8.15% వడ్డీ శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.

6 కోట్ల సబ్ స్క్రైబర్లు

ఈపీఎఫ్ఓకు ప్రస్తుతం ఆరు కోట్లకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వారికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతం వార్షిక వడ్డీ ఇవ్వాలని ఈపీఎఫ్ఓ సిఫారసు చేసింది. త్వరలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లకు 8.15% చొప్పున వడ్డీ వారి ఖాతాల్లో జమ కానుంది. 2021 -22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీ రేటును 4 దశాబ్దాల కనిష్టమైన 8.10 శాతానికి 2022 మార్చి నెలలో ఈపీఎఫ్ఓ తగ్గించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది.

అధిక పెన్షన్ కు దరఖాస్తు..

ఈపీఎఫ్ఓ పోర్టల్ లో అధిక పెన్షన్ కోసం జాయింట్ ఆప్షన్ తో అప్లై చేసుకోవడం చాలా సులువు అని కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి లోక్ సభకు తెలిపారు. 2023 మే నెలలో ఈపీఎఫ్ఓ కు కొత్తగా 8.83 లక్షల మంది సబ్ స్క్రైబర్లు చేరారు. గత ఆరు నెలల్లో ఇదే అత్యధికం. అలాగే సుమారు 11.41 లక్షల మంది ఈపీఎఫ్ఓను వీడి, ఆ తరువాత మళ్లీ జాయిన్ అయ్యారు.

WhatsApp channel